ఎన్టీఆర్ పక్కన రెండు డైలాగులు చెబితే చాలు.. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ విడిపోయాడా, హైపర్ ఆది కామెంట్స్

First Published | Dec 12, 2024, 6:01 PM IST

జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాల్లో కూడా కమెడియన్ గా రాణిస్తున్నాడు. చివరగా హైపర్ అనాది వెంకీ అట్లూరి తెరకెక్కించి సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ లో నటించిన సంగతి తెలిసిందే.

జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాల్లో కూడా కమెడియన్ గా రాణిస్తున్నాడు. చివరగా హైపర్ అనాది వెంకీ అట్లూరి తెరకెక్కించి సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ లో నటించిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. హైపర్ ఆది ప్రాసలతో పంచ్ డైలాగులతో బాగా ఫేమస్ అయ్యాడు. 

హైపర్ ఆది సినిమాల గురించి మాత్రమే కాదు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. హైపర్ ఆది జనసేన పార్టీ మద్దతు దారుడు అనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఇంటర్వ్యూలో హైపర్ ఆది కొందరు హీరోల గురించి తనదైన శైలిలో స్పందించారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే అభిమానం. ఆయన గురించి మాట్లాడుతుంటా. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం. దీనితో నేను మెగా అభిమానిని అనే ముద్ర వేసేశారు. కానీ నటుడిగా అందరి హీరోలతో నటించాలని ఉంటుంది. 

Tap to resize

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు 'ఏమి నటుడబ్బా' అని అనిపిస్తుంది. ఒక్క సినిమాలో అయినా ఎన్టీఆర్ పక్కన నిలబడి రెండు డైలాగులు చెబితే చాలు అంటూ హైపర్ ఆది తెలిపారు. ఎన్టీఆర్ నటనపై ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించారు. 

Also Read : నితిన్, రామ్ పోతినేని, వరుణ్ తేజ్ తోపాటు టాలీవుడ్ కుబేరుడికి కూడా బిగ్ షాక్.. ఈ దెబ్బకి కోలుకోవాలంటే..

అదే విధంగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వివాదాల గురించి హైపర్ ఆది మరోసారి స్పందించాడు. ఇవంతా సోషల్ మీడియాలో కొందరు సృష్టించే గాలి వార్తలు అని హైపర్ ఆది తెలిపారు. నిజగానే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ విడిపోతే చూసి ఆనందించాలి అనుకునే బ్యాచ్ కొందరు ఉంటారు. వాళ్ళే సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అల్లు అర్జున్, రాంచరణ్ స్టార్ అయ్యాక వారికి చాలా మంది అభిమానులుగా మారారు. 

కానీ వీళ్లంతా చిరంజీవి గారి కళ్ళ ముందు పెరిగారు. చిరంజీవి, అల్లు అరవింద్ బావ బావమరుదులు. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ అనే వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు. కుటుంబ బంధాలని ఫ్యాన్స్ డిసైడ్ చేయలేరు. అల్లు, మెగా ఫ్యామిలీ నిజంగానే విడిపోతున్నారు అని వార్తలు సృష్టించే వాళ్ళని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని హైపర్ ఆది తెలిపారు. 

Latest Videos

click me!