డిసెంబర్ లో మరోవారం సెలవు తీసుకునే ఛాన్స్ :
2024 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాదిలో పండగలు, ప్రత్యేక రోజుల్లో ఇచ్చే సెలవులే కాకుండా భారీ వర్షాలు, వరదల కారణంగా మరిన్ని హాలిడేస్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. ఏడాది చివర్లో మరో మూడ్రోజుల క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి. అయితే ఓ రెండ్రోజులు సెలవు పెడితే ఏకంగా 9 రోజుల క్రిస్మస్ హాలిడేస్ పొందవచ్చు.
హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా స్కూళ్లకు శని, ఆదివారాలు సాధారణ సెలవు వుంటుంది. అంటే డిసెంబర్ 21,22 సెలవు వుంటుందన్నమాట. డిసెంబర్ 23 సోమవారం లీవ్ తీసుకుంటే మళ్లీ డిసెంబర్ 24,25,26 క్రిస్మస్ సెలవులు. మళ్లీ డిసెంబర్ 27 శుక్రవారం లీవ్ తీసుకుంటే డిసెంబర్ 28,29 (శని,ఆదివారం) మళ్లీ సెలవు. అంటే రెండు లీవ్స్ తీసుకుంటే వరుసగా 9 రోజులు సెలవులు వస్తాయి. కేవలం ఆదివారం మాత్రమే సెలవు వుండే స్కూల్ విద్యార్థులు డిసెంబర్ 23,27,28 లీవ్ పెడితే వరుసగా ఎనిమిది రోజుల సెలవులు వస్తాయి.
అయితే విద్యార్థులు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్లి శ్రద్దగా చదువుకోడం చాలా ముఖ్యం. కాబట్టి అందరూ ఇలా లీవ్స్ పెట్టి ఎక్కువరోజుల సెలవులు తీసుకోవాలని చెప్పడం మా ఉద్దేశం కాదు. కేవలం క్రిస్మస్ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి హాలిడే ట్రిప్స్ కు వెళ్లాలనుకునే విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువరోజుల సెలవులు పొందవచ్చని చెప్పడమే మా ఉద్దేశం.