అయితే క్లీంకార ఎలా ఉంటుందో, ఎవరి పోలికలతో ఉంటుందో అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖాన్ని మాత్రం క్లియర్ గా చూపించకుండా టీజింగ్ చేస్తున్నారు. తాజాగా ఉపాసన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అపోలో ఆసుపత్రుల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి, తల్లిదండ్రులు అనిల్, శోభన కామినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయంలో ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్నాయి.