business

క్రెడిట్ కార్డు విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

1. కార్డును తెలివిగా వాడండి

క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడండి. బడ్జెట్ దాటి ఖర్చు చేయకండి. ప్లానింగ్ లేని ఖర్చులు అప్పులకు దారితీస్తాయి.

2. బిల్లులు సకాలంలో చెల్లించండి

క్రెడిట్ కార్డ్ బిల్లులు ఎప్పుడూ సమయానికి చెల్లించండి. లేకపోతే భారీ వడ్డీలు కట్టక తప్పదు. జీతం మొత్తం వడ్డీలకే సరిపోతుంది.

3. మినిమం బ్యాలెన్స్ చెల్లించకండి

క్రెడిట్ కార్డ్ కంపెనీలు మినిమం చెల్లింపు ఆప్షన్ ఇస్తాయి. అస్సలు దాని జోలికి వెళ్లకండి. దీని వల్ల వడ్డీ ఎక్కువ అవుతుంది. మొత్తం బ్యాలెన్స్ ఒకేసారి చెల్లించడానికి ప్రయత్నించండి.

4. క్రెడిట్ లిమిట్ దాటకండి

క్రెడిట్ కార్డ్ ఖర్చులను మీ క్రెడిట్ లిమిట్ లోపలే ఉంచుకోండి. అది దాటితే వడ్డీలు పెరుగుతాయని గుర్తుంచుకోండి.

5. ఫ్రీ ట్రాన్షాక్షన్స్, ఆఫర్లు

చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు  ఫ్రీ ట్రాన్షాక్షన్స్, ప్రత్యేక ఆఫర్లు అందిస్తాయి. వీటిని ఉపయోగించుకుంటే మీకు డబ్బులు కలిసి వస్తాయి.

6. లోన్ డిస్కౌంట్లను పరిశీలించండి

క్రెడిట్ కార్డ్ అప్పు ఎక్కువైతే కొన్ని బ్యాంకులు లోన్ డిస్కౌంట్లను ఇస్తాయి. మీరు వాటికి అర్హులైతే తప్పకుండా ఉపయోగించుకోండి. 

7. క్రెడిట్ రిపోర్ట్ చూసుకోండి

క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. కార్డ్ వాడకంలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోండి.

8. సరైన కార్డును ఎంచుకోండి

క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు, బ్యాంకు రూల్స్, వడ్డీ రేట్లు తెలుసుకోండి. మీ అవసరాలకు తగిన కార్డును మాత్రమే ఎంచుకోండి.

9. ఆఫర్లకు ఆశపడకండి

క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆకర్షిస్తాయి. వాటి వెనుక కఠిన రూల్స్ మీరు కచ్చితంగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి.

10. అవసరమైనప్పుడే వాడండి

అవసరమైనప్పుడే క్రెడిట్ కార్డును వాడండి. అనవసరమైన కొనుగోళ్లకు లేదా షోఆఫ్ కోసం ఉపయోగించి ఇబ్బందులు పడకండి.

గ్రహాలన్నిటిలోనూ స్పీడ్ గా తిరిగే గ్రహం ఏంటో తెలుసా?

ఆన్‌లైన్ జాబ్ స్కామ్‌ల నుండి ఇలా తప్పించుకోండి

BSNLలో 4G VoLTEని యాక్టివేట్ చేయాలా? ఇదిగో సింపుల్ టిప్

1.20 లక్షలు తగ్గింపు.. మహీంద్రా బొలెరోపై భారీ డిస్కౌంట్లు !