Jul 21, 2020, 4:46 PM IST
పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు 30 యేళ్ల ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాతవాహన వర్సిటీలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, కరీంనగర్ లో 34 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గ్రామీణ ప్రజల జీవితాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఏపని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుందన్నారు. తాగు, సాగునీరు, విద్యుత్ ిబ్బందులను తక్కువకాలంలో అధిగ మించామన్నారు.