ప్రభాస్ డ్రీమ్ రోల్ ఎంటో తెలుసా..? ఇప్పటికీ ఆ పాత్ర కోసం ఎదరుచూస్తోన్న రెబల్ స్టార్..

First Published | Nov 26, 2024, 7:30 PM IST

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్  తన కెరీర్ లో చాలా పాత్రలు చేశారు. బాహుబలి తరువాత ప్రభాస్ ఎంచుకున్న క్యారెక్టర్స్ వేరే లెవల్.. కాని ఇన్ని పాత్రలు చేసినా.. ప్రభాస్ డ్రీమ్ రోల్ మాత్రం అలాగే ఉండిపోయిందట ఇంతకీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డ్రీమ్ రోల్ ఏంటీ..? అది సాధ్యం అయ్యేదేనా..? 
 

అంతే కాదు స్పిరిట్ లో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చెప్పలేం. సందీప్ రెడ్డి హీరోలను ఎలా చూపిస్తాడో తెలిసిందే. ఇక ఇన్ని రకాల పాత్రలు చేస్తున్నా ప్రభాస్ కు మాత్రం సంతృప్తి లేదట. ఆయనకు ఓ డ్రీమ్ రోల్ ఉండట. ప్రభాస్ ఎంతో ఇష్టంగా చేయాలనకున్న పాత్ర ఒకటి ఉందట. ఇంతకీ ఆ పాత్రం ఏంటో తెలుసా..? 
పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్న ప్రభాస్  వందల కోట్ల కలెక్షన్స్ ను సాధిస్తున్నాడు. 

Also Read: ధనుష్ రోలెక్స్ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా..? 2BHK ఇల్లే కొనొచ్చు

బాహుబలితో వెయ్యి కోట్లు.. బాహుబలి2 తో 12 వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ప్రభాస్.. ఆతరువాత మూడు పాన్ ఇండియా సినిమాల ప్లాప్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. సాహో.  రాధే శ్యామ్,  ఆదిపురుష్, లాంటి ప్లాప్ లు చూసిన ప్రభాస్.. ఆతరువాత  సలార్  సినిమాతో కాస్త కూల్ అయ్యాడు. ఈసినిమా 800 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ప్రభాస్ కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది.  

Also Read: అభిషేక్ తో నటించనని చెప్పిన ఐశ్వర్య రాయ్, డివోర్స్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా..?


ఇక కల్కీ సినిమా  ప్రభాస్ అనుకున్నదానికంటే ఎక్కువ ఇచ్చింది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు.. 12 వందల కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. అయితే చాలా పాత్రలు చేసిన ప్రభాస్..  బాహుబలి, సలార్, కల్కి లు కాకుండా ప్రభాస్ కి ఒక డ్రీమ్ రోల్  ఉందట. ఇక ఎప్పటికైనా ఆ పాత్రలో నటించాలని అనుకున్నాడట. ఆ ప్రయత్నం  కూడా చేస్తున్నాడట. కాని అది సాధ్యం అవ్వడంలేదట. 

ఆ పాత్ర చేయడానికి సరైన కథతో ప్రాపర్ గా ఎవరైనా దర్శకుడు తన దగ్గరకు వస్తే.. సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట ప్రభాస్. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా.. ఛత్రపతి శివాజీ పాత్ర. ప్రభాస్ కి ఛత్రపతి శివాజీ స్టోరీ అంటే చాలా ఇష్టమట. ఆయన పాత్రలో నటించడానికి ప్రభాస్ ఉవ్విళ్లూరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక లైఫ్ లో ఒక్కసారైనా ఆ పాత్రలో నటించాలని తను ఆరాటపడుతున్నాడట. గతంలో రాజమౌళి డైరెక్షన్ లో ఛత్రపతి సినిమాలో శివాజీ పాత్ర చేశాడు ప్రభాస్. 

ఆ పాత్రకు ఎంత పవర్ ఉందో చెప్పనక్కర్లేదు. ఇక అసలు చత్రపతి పాత్రలో.. ప్రభాస్ హైట్ కు.. ఆయన పర్సనాలిటీకి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శివాజీ బయోగ్రఫీని సినిమాగా తీయాలనే ఉద్దేశ్యం ఉన్న దర్శకులు ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగా అందులో కొంచెం మార్పులు చేర్పులు చేసి ఆ కథను కనక ప్రభాస్ వద్దకు తీసుకెళ్తే పక్కాగా ప్రభాస్ ఆ కథను ఒప్పుకొని ఆ సినిమాను చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. వార్త మాత్రం వైరల్ అవుతుంది.  అయితే ప్రభాస్  పవర్ ఫుల్  డ్రీమ్ రోల్ లో కనిపిస్తే.. చూడాలని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ ఛత్రపతి శివాజీ పాత్రలో ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి మరి. 

Latest Videos

click me!