ప్రాంక్‌ వీడియో చేసి అడ్డంగా దొరికిన ప్రియాంక జైన్‌.. బిగ్‌ బాస్‌ నటిపై టీటీడీ సీరియస్‌.. ఏం జరిగిందంటే?

First Published | Nov 26, 2024, 8:05 PM IST

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ప్రియాంక జైన్‌ వివాదంలో ఇరుక్కుంది. తన ప్రియుడితో కలిసి టీటీడీ మెట్లపై ఆమె చేసిన చిల్లర పని ఇప్పుడు సర్వత్రా విమర్శలకు కారణమవుతుంది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షోతో పాపులర్‌ అయ్యింది సీరియల్ నటి ప్రియాంక జైన్‌. గత సీజన్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ గా మెప్పించింది. శోభా శెట్టితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంతేకాదు అందంగానూ ఉంటూ ఆకట్టుకుంది. స్మార్ట్ గేమ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక. ఆల్మోస్ట్ ఎండింగ్‌ వరకు హౌజ్‌లో ఉండి ఆకట్టుకుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Bigg Boss fame Priyanka jain

ప్రియాంక జైన్‌ కి లవర్‌ ఉన్నాడు. నటుడు శివతో ఆమె డేటింగ్‌లో ఉంది. అధికారికంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. పెళ్లికి కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రేమ జంట రీల్స్, ప్రాంక వీడియోలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌ లో వీడియోలు పంచుకుంటూ అలరిస్తున్నారు. కామెడీ వీడియోలతో ఆకట్టుకుంటున్నారు. 


Priyanka Jain

ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ఓ వీడియో చేశారు. తిరుమల అలిపిరి మెట్లపై నుంచి శ్రీవారికి వెళ్తూ చిరుత ఉందంటూ ప్రాంక్‌ చేశారు. చిరుత వచ్చిందని ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. దీన్ని తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్?? అంటూ ఇద్దరూ షాక్ అయిన ఫొటోలతో తంబ్ నెయిల్ పెట్టి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు.

వీడియో చివర్లో చిరుత లేదు ఏం లేదు అంతా ప్రాంక్‌ ఉసూరు మనిపించారు. థంబ్‌లో చిరుత పిక్ ని కూడా వారు. ఎనిమిది నెలల క్రితం పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. 
 

Priyanka Jain

తిరుమల శ్రీవారు అంటే పవిత్రతకు మారుపేరు. అక్కడ ఎవరైనా భక్తిభావనతోనే వెళ్తారు. కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్న ప్రియాంక జైన్‌, శివలు ఇలా జనాలను తప్పుదోవ పట్టించేలా, అభిమానులు కలవరానికి గురి అయ్యేలా ఇలాంటి భయానక ప్రాంక్ వీడియో చేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్యాన్స్ సైతం ఫైర్‌ అవుతున్నారు.  

Priyanka Jain

ఈ వివాదం టీటీడీ దృష్టికి రావడంతో టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. పవిత్రమైన గుడిలో ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో తమిళ నాడుకి చెందిన విద్యార్థులుకూడా ఇదే విధంగా ప్రాంక్‌ చేయడంతో వారిపై కేసులు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి.

భక్తుల మనోభావాలతో, ఎమోషన్స్, సెంటిమెంట్లని తమ వ్యూస్‌ కోసం వాడుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎటు వైపు దారితీస్తుందో చూడాలి. కానీ వీరిపై మాత్రం సోషల్‌ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్‌ నడుస్తుంది. 

read more: సందీప్‌ రెడ్డి వంగానే నమ్ముకున్న సుకుమార్‌.. `పుష్ప 2` నిడివి ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాకే!

also read: `బాషా` సినిమా చిరంజీవి చేయాల్సిందా? ఎలా మిస్‌ అయ్యింది? అల్లు అరవింద్‌ దెబ్బేశాడా?
 

Latest Videos

click me!