Jan 20, 2023, 11:45 AM IST
దావోస్ : స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర చర్చ జరిగింది. ది ఫైనాన్సియల్ టైమ్స్ చీఫ్ ఎకనామిక్ కామెంటేటర్
మార్టిన్ వోల్ఫ్ భారత ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా వుందో వెల్లడించారు. వచ్చే 10-20 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పుంజుకుంటుదని అన్నారు. ఇలా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ అవరతరిస్తుందంటూ మార్టిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.