పుష్ప 2: అల్లు అర్జున్ అర్జెంట్ గా ఆ వీడియో చేయాల్సిందే! !

First Published | Nov 28, 2024, 5:11 PM IST

పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. హైదరాబాద్ ఈవెంట్ కు ముందు అల్లు అర్జున్ యాంటీ డ్రగ్స్ వీడియో చేయాల్సి ఉంది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.

Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI


ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప2 కబుర్లే. సినిమా ఎలా వచ్చింది. ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయా. యాక్షన్ ఎపిసోడ్స్ కు ప్రయారిటీ ఇచ్చారా. ఇలా ఒకటే డిస్కషన్.  అల్లు అర్జున్, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప2 : ది రూల్ సినిమా షూటింగ్, సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

కాగా డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ తెలుగుతోపాటూ తమిళ్, మలయాళం, హిందీ తదితర ఫ్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపధ్యంలో సినిమాని జనాల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లేందుకు ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేసారు. అయితే ఇక్కడే ఓ కండీషన్ ఉంది. 
 

Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI


 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుతం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ సెలెబ్రెటీలు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కలిగించేందుకు వీడియో చేసి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందనే రూల్ పెట్టారు.  ఏ హీరో అయినా సరే, ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలంటే ప్రజలను చైతన్య పరిచేలా యాంటీ డ్రగ్స్ మీద ఓ వీడియో బైట్ ఇవ్వాల్సిందే.

ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు వుంది ప్రభుత్వం. ఆ మధ్య దేవర విడుదల టైమ్ లో ఇదే జరిగింది. ప్రభుత్వం నుంచి అదనపు రేట్లు కావాలి ఫర్మిషన్స్ కావాలంటే ఈ వీడియో తప్పదు. అప్పుడు విదేశాల్లో వున్న హీరో ఎన్టీఆర్ అప్పటికప్పుడు వీడియో చేసి ఇవ్వాల్సి వచ్చింది.


Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI


  ప్రస్తుతం అల్లు అర్జున్ యాంటీ డ్రగ్స్ విడియో చేసి ప్రభుత్వానికి అందించనున్నారని సమాచారం. ఈ వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేసి మత్తు మందు వినియోగంపై అవేర్నెస్ కలిగిస్తారు.  మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు   పుష్ప 2 కోసం హైదరాబాద్ లో ఈవెంట్ చేయాల్సి వుంది.

దీనికి ఫర్మిషన్  కోసం చూస్తున్నారు. ఇది కావాలంటే ముందుగా బన్నీ వైపు నుంచి కూడా యాంటీ డ్రగ్స్ వీడియో బైట్ ఇవ్వాల్సిందే అని తెలిస్తోంది. ఇప్పుడు బన్నీ ఆ వీడియో  చేసే అవకాశం వుంది.


ఇక అల్లు అర్జున్ 5 ఏళ్ళ పుష్ప సినిమా జర్నీ ముగిసిందంటూ ఎక్స్ లో ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. ఇక పుష్ప 2 సినిమాలో  హీరోయిన్ గా  రష్మిక మందాన నటిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, అజయ్, సునీల్, ధనుంజయ్(కన్నడ), అనసూయ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. నవంబర్ 17న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Allu Arjun, #Pushpa2, sukumar


ఇదిలా ఉంటే తాజాగా ఈ పాన్‌ ఇండియా మూవీ పుష్ప 2 సెన్సార్‌   కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 3: 18గంటలు ఉన్నట్లు సమాచారం .  రన్‌టైమ్‌ ఎక్కువ ఉన్నా సినిమా మంచి విజయాన్ని అందుకోవచ్చని ‘పుష్ప’ పార్ట్‌ 1 నిరూపించింది.

ఆ మూవీ రన్‌టైమ్‌ దాదాపు 3 గంటలు. దీంతో, పార్ట్‌ 2 నిడివి పార్ట్‌ 1 కంటే కాస్త పెరిగినా ప్రేక్షకులు ఆస్వాదించగలరని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో సినిమా ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నిర్మాత నవీన్‌ యెర్నేని సైతం ‘పుష్ప 2’ రన్‌టైమ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేశారు. లెంగ్త్ ఎంత ఉన్నా ఇబ్బందేం లేదని, సినిమా చూశాక అసలు దాని గురించే మాట్లాడుకోరని అన్నారు.

Latest Videos

click me!