జుట్టు ఊడిపోతోందా...చర్మం పొడిబారిపోతుందా...అయితే డి విటమిన్ లోపం గురించి తెలుసుకోవాల్సిందే...

Nov 27, 2022, 8:35 PM IST

మన శరీరం సరిగా పనిచేయడానికి వివిధ రకాల విటమిన్లు , ఖనిజాలు అవసరం. విటమిన్ల కొరత వివిధ సమస్యలను కలిగిస్తుంది. మన చర్మం , జుట్టుకు కొన్ని విటమిన్లు ఖనిజాలు  చాలా అవసరం. అవి అందకుంటే చర్మం పేలవంగా మారుతుంది.. ఇక జుట్టు ఊడిపోతుంది లేదంటే నిర్జీవంగా మారుతుంది. అలా చర్మానికి కచ్చితంగా అవసరమైన విటమిన్ లలో డి ఒకటి. ఈ డి విటమిన్ ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్.