Galam Venkata Rao | Published: Feb 9, 2025, 5:01 PM IST
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్త దాతలను ఆయన సత్కరించారు. తన అభిమానుల వల్లే ఇన్నేళ్లుగా బ్లడ్ బ్యాంక్ నడుస్తోందని చెప్పారు. తన తదనంతరం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దాన్ని కొనసాగిస్తారని తెలిపారు. అలాగే, తనపై విమర్శలు చేసిన కమ్యూనిస్టు నాయకుడికి మహిళా అభిమాని చెమటలు పుట్టించిన ఘటన గురించి ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తాను చేసే మంచి పనులే వారి దృష్టిలో తనను హీరోగా నిలిపాయని చెప్పారు.