Janasena : జగన్ ఒక హాస్యనటుడు.. మ‌ళ్లీ గెలుస్తామ‌ని ఎన్నో కలలు కన్నారు: నాగ‌బాబు సెటైర్లు

Published : Mar 14, 2025, 10:22 PM ISTUpdated : Mar 14, 2025, 10:27 PM IST

Nagababu: జనసేన వార్షికోత్సవ సభలో జనసేన నాయకుడు నాగబాబు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్‌ కలలు కన్నారని సెటైర్లు వేశారు.  

PREV
Janasena :  జగన్ ఒక హాస్యనటుడు.. మ‌ళ్లీ గెలుస్తామ‌ని ఎన్నో కలలు కన్నారు:  నాగ‌బాబు సెటైర్లు

Jana Sena Annual Meeting: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జ‌న‌సేన‌ ‘జయకేతనం’ సభకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. జనసేన వార్షికోత్సవ సభలో జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్‌ కలలు కన్నారని సెటైర్లు వేశారు. ఆయ‌న ఒక హ‌స్య‌న‌టుడు అంటూ కామెంట్స్ చేశారు. 

పిఠాపురం ప్రజలు, జన సైనికులకు బలంతో నేడు ఇలా ఉన్నామ‌నీ, వారికి రుణపడి ఉన్నామని  నాగ‌బాబు అన్నారు. జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూ నోటి దురుసుతో ప్ర‌తిప‌క్ష హోదాను కూడా పొంద‌లేక‌పోయార‌ని వైకాపా టార్గెట్ గా విమ‌ర్శ‌లు గుప్పించారు. 

నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల‌న్నారు. అలా కాద‌నీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు తీర్పును చూశామ‌న్నారు. నోటిదురుసు ఉన్న నేతల‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదనే విష‌యాలు ప్ర‌స్తావించారు. 

జ‌గ‌న్ లాంటి హాస్య‌న‌టులు మళ్లీ అధికారంలోకి వస్తామని ఎన్నో కలలు కన్నారంటూ సెటైర్లు వేశారు. అయితే, మరో 20 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వారు కలలు కంటూనే ఉండాలంటూ ఎద్దేవా చేశారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను, దారుణ పాల‌న‌ను గుర్తించి ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో అద్భుత‌మైన తీర్పును ఇచ్చార‌ని చెప్పారు. 9 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ విజయంలో క‌లిసి న‌డిచార‌ని అన్నారు. కూట‌మి విజ‌యం వెనుక ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర చాలా ఉంద‌నీ, పిఠాపురంలో ప‌వ‌న్ గెలుపునకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు పిఠాపురం జ‌న‌సైనికులు ఉన్నార‌ని నాగ‌బాబు అన్నారు. వారికి ఎప్పటికీ రుణ‌ప‌డి ఉంటామ‌ని చెప్పారు. 

అలాగే, ప‌వ‌న్ కళ్యాణ్ పై నాగ‌బాబు ప్ర‌శంస‌లు కురిపించారు. ప్రజల సంక్షేమం కోసం ప‌నిచేసే వ్య‌క్తిగా ప‌వ‌న్ ను కొనియాడారు. మ‌నం కూడా ప‌వ‌న్ లాంటి గొప్ప వ్య‌క్తులు కావాలి లేదా ఆయ‌న‌కు అనుచరుడిగా ఉండాలని అన్నారు. ప‌వ‌న్ మ‌నం ఆడ‌గ‌కుండానే మ‌నకు వ‌రాలిస్తార‌ని చెప్పారు. 

Read more Photos on
click me!

Recommended Stories