Jana Sena Jayaketanam: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ‘జయకేతనం’ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హిందువులను చంపేస్తామంటే కోపం రాకుండా ఉంటుందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Jana Sena Jayaketanam: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన ‘జయకేతనం’ సభకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన వార్షికోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాన్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
27
'జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా, తెలంగాణ భూమి నాకు పునర్జన్మ ఇచ్చింది' అని పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ గేట్‌ను కూడా తాకలేవని చెప్పారు, వందశాతం స్ట్రయిక్ రేట్‌తో ఘనవిజయం సాధించాం, ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం అని పవన్ చెప్పుకొచ్చారు.
37
Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని తనను తీవ్రంగా అవమానించారనీ, అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని పవన్ కల్యాణ్ అన్నారు.
47
Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,
తాను మొదటి నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాని చెప్పిన పవన్ కళ్యాణ్.. పాతబస్తీలో ఒక నేత ఒక గంట టైమ్ ఇస్తే హిందువులను చంపేస్తామంటే మాకు కోపం రాదా అని ఫైర్ అయ్యారు.
57
Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,
తాము నిలబడటంతో పాటు నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామని జనసేన అధినే పవన్ కళ్యాణ్ అన్నారు.
67
ఇటీవల హిందీ వద్దనే కొత్త నినాదాలు మొదలు పెట్టారు. కానీ అలా అంటే కుదరదనీ, హిందీ అందరూ నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
77
Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,
తాను ఒక్కడిగా 2014లో జనసేన ప్రయాణం మొదలు పెట్టాననీ, నేడు ఈ స్థాయికి చేరుకున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.