IPL 2025: ఐపీఎల్ 10 జ‌ట్ల కెప్టెన్లు వీరే

IPL 2025 All 10 Teams captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా క్రికెట్ లీగ్ కోసం అన్ని జ‌ట్లు త‌మ కెప్టెన్ల‌ను ప్ర‌క‌టించాయి. ఏ జ‌ట్టును ఎవ‌రు న‌డిపించ‌నున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2025: Here are the captains of 10 teams details in telugu rma
Suryakumar

IPL 2025 All 10 Teams captains: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం కౌంట్‌డౌన్ మొద‌లైంది. ఒకవైపు దేశం మొత్తం ప్రస్తుతం హోలీ రంగులలో మునిగిపోతుండగా, మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తన కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. దీంతో ఐపీఎల్ 2025లో ఆడుతున్న టీమ్స్ న‌డిపించే అంద‌రు నాయ‌కులు ఎవ‌రో తెలిసిపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలం త‌ర్వాత జ‌ట్ల‌లో చాలా వ‌ర‌కు మార్పులు జ‌రిగాయి. అలాగే, కొన్ని జ‌ట్ల‌కు కొత్త కెప్టెన్లు కూడా వ‌చ్చారు. ఐపీఎల్ 2025 ఆడ‌బోయే 10 టీమ్స్ లో 9  జ‌ట్ల‌కు కెప్టెన్లు భారతీయులు కాగా, మిగిలిన ఒక టీమ్ కు విదేశీ కెప్టెన్ ఉన్నాడు. ఆ వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 

IPL 2025: Here are the captains of 10 teams details in telugu rma
Virat Kohli-Rajat Patidar

1. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు - రజత్ పాటిదార్

విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు రజత్ పాటిదార్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు. అతను చాలా కాలంగా ఈ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే, రాబోయే ఐపీఎల్ సీజ‌న్ లో కెప్టెన్ గా జ‌ట్టును ముందుకు న‌డిపించ‌నున్నాడు. 

2. ఢిల్లీ క్యాపిట‌ల్స్ - అక్షర్ పటేల్ 

ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తమ కొత్త కెప్టెన్‌గా భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది. అక్షర్ పటేల్ కు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మ్యాచ్ గెలిచే పూర్తి సామర్థ్యం అతనికి ఉంది. ఇటీవ‌ల భార‌త జ‌ట్టు కోసం బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. 


3. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ - అజింక్య రహానే

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ కొత్త కెప్టెన్‌గా అజింక్య రహానేను నియమించింది. గత సీజన్‌లో కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిచింది. కేకేఆర్ జ‌ట్టుకు టైటిల్ అందించిన మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు వేరే టీమ్ లోకి వెళ్లాడు.

4. పంజాబ్ కింగ్స్ - శ్రేయాస్ అయ్యర్

పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కొత్త కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధ‌ర‌కు అయ్య‌ర్ ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్.. చాలా రోజుల ముందే 2025 ఐపీఎల్ సీజ‌న్ కోసం కెప్టెన్ గా ప్ర‌క‌టించింది. అత‌ని కెప్టెన్సీలో కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్‌గా కూడా నిలిచింది.

5.  ల‌క్నో సూపర్ జెయింట్స్ - రిషబ్ పంత్

లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టుకు రిషబ్ పంత్ కొత్త కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ల‌క్నో టీమ్ రిష‌బ్ పంత్ ను ఏకంగా 27 కోట్ల రూపాయలకు కోనులోగు చేసింది. దీంతో పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సాధించాడు.

6. సన్‌రైజర్స్ హైదరాబాద్ - పాట్ కమ్మిన్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. గత సీజన్‌లో అతని కెప్టెన్సీలో హైద‌రాబాద్ టీమ్ ఫైనల్స్‌కు  చేరుకుంది. 

Image Credit: ANI

7. గుజ‌రాత్ టైటాన్స్ - శుభ్‌మన్ గిల్

గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత సంవత్సరం హార్దిక్ పాండ్యా టీమ్ ను వీడ‌టంతో గిల్ గుజరాత్ జట్టును ముందుకు న‌డిపించాడు. రాబోయే 2025 సీజ‌న్ లో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోనే ఆడ‌నుంది. 

8. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ -  సంజూ సామ్సన్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజు సామ్సన్ కొనసాగనున్నాడు. గత  కొన్ని సీజన్లుగా సంజూ రాజ‌స్థాన్ టీమ్ ను ముందుకు న‌డిపిస్తున్నాడు. 

9. ముంబై ఇండియ‌న్స్ - హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2025లో కూడా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. గత సీజన్‌లో అతని కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. అయితే, రాబోయే సీజ‌న్ లో దుమ్మురేపాల‌ని ముంబై ఇండియ‌న్స్ టార్గెట్ పెట్టుకుంది. 

10. చెన్నై సూప‌ర్ కింగ్స్ - రుతురాజ్ గైక్వాడ్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించారు. ఎంఎస్ ధోని కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన త‌ర్వాత రుతురాజ్ గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో కూడా చెన్నై టీమ్ ను ముందుకు న‌డిపించాడు.

Latest Videos

click me!