Galam Venkata Rao | Published: Feb 14, 2025, 3:00 PM IST
బతుకుదెరువు కోసం కువైట్‌కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ వాసులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. కువైట్‌కి పని నిమిత్తం వెళ్లినవారికి సరైన వసతి, పనికి తగ్గ వేతనంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కువైట్ అంబాసిడర్ మొసిల్ ముస్తఫా, భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కి లేఖలు రాసినట్లు తెలిపారు. రాయలసీమ నుంచి కువైట్‌కి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుండటంతో.. కువైట్ టు తిరుపతి డైరెక్ట్ ప్లైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరినట్లు చెప్పారు.