నిర్మాత బన్నీ వాసు వాడుకుని వదిలేసాడు... న్యాయం కోసం పవన్ వద్దకు..: యువతి సంచలనం

Mar 21, 2022, 12:34 PM IST

గుంటూరు: ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేసాడంటూ బోయ సునీత అనే మహిళ ఆందోళనకు దిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గెలుపుకోసం పనిచేయాలని బన్నీ వాసు సూచించాడని... తాను అలాగే చేసానని సునీత చెబుతున్నారు. ఈ సమయంలోనే గీతా ఆర్ట్స్ లో సినిమాలు ఇప్పిస్తానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకున్నాడని సునీత ఆరోపిస్తోంది. తాను జనసేన పార్టీకోసం పనిచేసాను కాబట్టి అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు గోడు చెప్పుకోడాలని మంగళగిరి జనసేన ఆఫీస్ కు వచ్చినట్లు బోయ సునీత తెలిపారు. కాని ఆఫీస్ సిబ్బంది తనను లోపలికి రానివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తనకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్‌కు విజ్ణప్తి చేస్తూ జనసేన కార్యాలయం బయట సునీత నిరసన చేపట్టింది.