business
SpaceX, టెస్లా CEO ఎలాన్ మస్క్ $400 బిలియన్లకు పైగా సంపదను ఆర్జించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
Bloomberg నివేదిక ప్రకారం అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన సంపద పెరిగింది. SpaceXలో ఇటీవల షేర్ల అమ్మడం కూడా కలిసి వచ్చింది.
SpaceX షేర్ల అమ్మకం ద్వారా మస్క్ సంపద దాదాపు $50 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద $439.2 బిలియన్లు అయ్యింది.
2022 చివరిలో మస్క్ సంపద $200 బిలియన్లకు పైగా తగ్గింది. అయితే ట్రంప్ ఎన్నిక ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ట్రంప్ విధానాలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ, మార్కెట్ కి ఉపయోగపడతాయని వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అందువల్లే ప్రస్తుతం టెస్లా షేర్లు 65% పెరిగాయి.
ట్రంప్ పరిపాలనలో కొత్త 'ప్రభుత్వ పనితీరు విభాగం' సహ అధ్యక్షుడిగా ఎలాన్ మస్క్ ఎలక్ట్ అయ్యారు. ఈ స్టెప్ తో ఆయన రాజకీయంగా, వ్యాపారపరంగా ఎదగడానికి అడుగుపడింది.
మస్క్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI విలువ ఏడు నెలల్లోనే $50 బిలియన్లకు రెట్టింపు అయింది. అందుకే ఆయన సంపద విలువ పెరుగుతోంది.
SpaceX ఆదాయం అమెరికా ప్రభుత్వ ఒప్పందాలపై ఆధారపడి ఉంది. అందుకే ట్రంప్ నాయకత్వం SpaceXకి ప్రయోజనం చేకూరుస్తోంది.
వ్యోమగాములను అంగారకుడిపైకి పంపాలన్న తన కలను ఎన్నికల ప్రచారంలో మస్క్ వెల్లడించారు. దీనికి ట్రంప్ మద్దతు ఇచ్చారు. ఎన్నికల తర్వాత SpaceX ప్రయోగంలో మస్క్‌తో కలిసి ట్రంప్ కనిపించారు.