vuukle one pixel image

Ambati Rambabu Satires on Chandrababu: లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. అమిత్ షా వద్ద ప్రస్తావన

Galam Venkata Rao  | Published: Jan 21, 2025, 3:01 AM IST

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకి విందు ఇవ్వడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్విడ్‌ ప్రో కో కింద కాజేసిన కరకట్ట అక్రమ నిర్మాణంలో అమిత్‌ షాకు చంద్రబాబు విందు ఇవ్వడం దారుణమన్నారు. ఈ విందు సందర్భంగా తన కుమారుడు నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ చంద్రబాబు ప్రాదేయపడ్డారన్నారు. దీనిపై అమిత్‌ షా అసంతృప్తి వ్యక్తం చేస్తూ నారా లోకేష్‌ అన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటూ చేస్తున్న వసూళ్ల వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మందలించారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.