వెంకటేష్, మోహన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ చిత్రం.. ప్లాన్ చేసింది మామూలు డైరెక్టర్ కాదు
పూరి జగన్నాధ్ పవన్, మహేష్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలందరితో సినిమాలు చేశారు. కానీ వెంకటేష్ తో తప్ప.
పూరి జగన్నాధ్ పవన్, మహేష్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలందరితో సినిమాలు చేశారు. కానీ వెంకటేష్ తో తప్ప.
విక్టరీ వెంకటేష్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. వెంకటేష్ గతంలో యాక్షన్ చిత్రాలు చాలా చేసేవారు. ఇప్పుడు బాగా తగ్గించారు. వెంకటేష్ కి మాస్ లో కంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువగా అభిమానులు ఉన్నారు.
హీరోలకు సపరేట్ మ్యానరిజమ్స్ ఇవ్వాలంటే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా. పూరి జగన్నాధ్ పవన్, మహేష్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలందరితో సినిమాలు చేశారు. కానీ వెంకటేష్ తో తప్ప. వెంకీ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఒక్క చిత్రం కూడా రాలేదు.
అయితే గతంలో పూరి జగన్నాధ్..వెంకీతో సినిమా చేసేందుకు ప్రయత్నించారట. రచయిత తోట ప్రసాద్ ఈ విషయాన్ని బయట పెట్టారు. పూరి జగన్నాధ్ పోకిరి చిత్రానికి ముందు నాగార్జున, సోనూసూద్ కాంబినేషన్ లో సూపర్ చిత్రాన్ని తెరకెక్కించారు.
వాస్తవానికి ఈ చిత్రంలో హీరో వెంకటేష్ అట. సోనూ సూద్ పాత్రలో మోహన్ బాబుని అనుకున్నారట. కథ కూడా ఆ విధంగానే రాసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ చిత్రం నాగార్జున చేతుల్లోకి వెళ్ళింది. సూపర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు కానీ పర్వాలేదనిపించే విజయం సాధించింది. గతంలో వెంకీ, మోహన్ బాబు చాలా చిత్రాల్లో నటించారు. ఇటీవల కాలంలో వీరిద్దరూ కలసి నటించిన చిత్రం ఒక్కటి కూడా లేదు.