Parenting tips: పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడానికి కారణం ఇవే..!

తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పిన మాట విని బుద్ధిగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు పేరెంట్స్ మాట అస్సలు వినరు. ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తారో? దానికి పరిష్కారం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Effective Parenting How to Make Your Kids Listen in telugu KVG

సాధారణంగా తల్లిదండ్రులు చెప్పే మాటలను బుద్దిగా వినే పిల్లలు భవిష్యత్ లో మంచి స్థానంలో ఉంటారని పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు తాము చెప్పినట్టు వినాలని కోరుకుంటారు. కానీ కొందరు పిల్లలు పేరెంట్స్ మాట అస్సలు వినరు. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రుల మాట వినకపోతే దానికి కొన్ని విషయాలు కారణం కావచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

Effective Parenting How to Make Your Kids Listen in telugu KVG
ఇచ్చిన మాట..

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చరు. చెప్పేది ఒకటి చేసేది మరొకటిగా ఉంటారు. దీనివల్ల పిల్లలు తల్లిదండ్రులు చెప్పేది చేయరని నమ్మడం మొదలు పెడతారు. కాబట్టి పిల్లలకు ఏదైనా మాటిస్తే.. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి.


ఒంటరితనం

పిల్లలు ఆకలి, నిద్ర, ఒంటరితనం, విసుగు, కోపం లాంటివి అనుభవించినప్పుడు తల్లిదండ్రుల మాట వినరు. దీనివల్ల తల్లిదండ్రుల కంట్రోల్లో పిల్లలు లేరని అనిపించవచ్చు. కానీ తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత వారిని మారుస్తాయి.

బలవంతం చేయడం

పిల్లలను బలవంతం చేయడం వల్ల వారు మాట వినని పిల్లలుగా ఎదుగుతారు. అలాగే వారు చెప్పేదంతా చేసే తల్లిదండ్రులు ఉన్నా కొంచెం కష్టమే. పిల్లలకు కొన్నిసార్లు 'నో' చెప్పడంలో తప్పులేదు.

ప్రాధాన్యం ఇవ్వాలి

పిల్లలకు ప్రత్యేకమైన ఇష్టాలు కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులు వాటిని కచ్చితంగా గుర్తించాలి. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడం, డబ్బు సంపాదించడం, పిల్లలకు కావాల్సినవి ఇవ్వడమే కాదు. వారితో ప్రేమగా ఉండాలి. వారి ప్రాధాన్యతలు తెలుసుకోవాలి.

బలమైన బంధం

ఈ విషయాల్లో ఏదైనా ఒకటి మీరు చేస్తుంటే దాన్ని మార్చుకోవడం మంచిది. మీ పిల్లలకు, మీకు మధ్య బంధం బలంగా ఉన్నప్పుడే వారు మీ మాటకు విలువ, గౌరవం ఇస్తారు.

Latest Videos

click me!