Sobhan Babu, Jayalalitha
Sobhanbabu-Jayalalitha: తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబు, జయలలిత ప్రేమించుకున్నారు. కానీ పెళ్లికి దూరంగా ఉన్నారు. శోభన్‌బాబుకి ఆల్‌రెడీ పెళ్లి కావడంతో ఆ బంధానికి రెస్పెక్ట్ చేస్తూ దూరంగానే ఉన్నారు. పెళ్లి చేసుకోకపోయినా ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉన్నారు.
ఆ అనుబంధాన్ని కొనసాగించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. శోభన్‌బాబు అంటే జయలలిత ఎంతగానో పడిచచ్చేదనే విషయం తెలిసిందే. ఆమె సీఎం అయినా శోభన్ బాబుపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. ఆ గౌరవంతో కూడిన అనుబంధాన్ని కొనసాగించారు.
Sobhan Babu, Jayalalitha
అయితే శోభన్‌బాబు, జయలలిత మాదిరిగానే టాలీవుడ్‌లో మరో జంట కూడా ఉంది. శోభన్ బాబు జయలలిత మాదిరిగానే ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వరకు వెళ్లారని తెలిసింది. కానీ ఫ్యామిలీస్‌కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్లు దూరంగానే ఉంటున్నారు. కానీ తమ రిలేషన్‌ని కొనసాగిస్తున్నారు. మరి ఆ జంట ఎవరు? ఆ కథేంటి? అనేది చూస్తే.
nagarjuna, tabu
శోభన్‌బాబు-జయలలితలా మిగిలిపోయిన టాలీవుడ్ స్టార్ జోడీ ఎవరో కాదు, నాగార్జున-టబు. వీరిద్దరు కూడా ఎంతగానో ప్రేమించుకున్న విషయం తెలిసిందే. వీరికి సంబంధించిన రూమర్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, కానీ అమలకు అన్యాయం చేయోద్దని నాగ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. నాగార్జున నిర్ణయం టబుకి బాధ కలిగించినా ఆ తర్వాత అర్థం చేసుకుని సైలెంట్‌గా ఉండిపోయింది. అయినా నాగార్జునపై ప్రేమ తగ్గలేదు.
ఆ ప్రేమకి గుర్తుగా ఆమె తన జీవితంలోకి మరెవ్వరినీ ఆహ్వానించలేకపోయింది. పెళ్లికి దూరంగా ఒంటరిగానే ఉండిపోయింది. జయలలిత కూడా ఒంటరిగానే ఉండిపోయిన విషయం తెలిసిందే. ఆమె అలా ఉండటానికి మరో కారణం కూడా ఉంది.
ఎంజీఆర్‌ని కూడా ఆమె ఆరాధించింది. పెళ్లైనా కూడా ఆమెతో క్లోజ్‌గా ఉన్నారు ఎంజీఆర్. రాజకీయ వారసత్వం కోసం జయలలిత కూడా అలా మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది.
ఇక్కడ టబు సైతం బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌తోనూ రిలేషన్‌లో ఉందని అంటారు. కానీ ఎవరు ఉన్నా నాగార్జున, టబు రిలేషన్ మాత్రం ఎవర్ గ్రీన్. అయితే టబు గురించి నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనతో స్నేహం ఇప్పటికీ అలానే ఉంది. హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చినా ఆమె తన ఇంటికే వస్తుందని, తమతో కలిసి భోజనం చేస్తుందని, అంతేకాదు తన ఇంటికి ఎదురుగానే ఇళ్లు కూడా కొనుక్కుందని తెలిపారు.
అర్థరాత్రి బెడ్‌పై ఉన్నా కూడా, అమల పక్కన ఉన్నా కూడా తనకు వచ్చే ఒకే ఒక్క కాల్ టబుదే అని, ఆమెకి ఏ బాధ కలిగినా తనకు ఫోన్ చేస్తుందని తెలిపారు నాగార్జున. అలా మొత్తంగా శోభన్ బాబు-జయలలితగానే నాగార్జున-టబులు కూడా ఒకరినొకరు ఆరాధించుకుంటూ అలానే ఉండిపోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
read more: `దిల్ రూబా` మూవీ రివ్యూ, రేటింగ్
also read: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్, ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన బ్యూటీ ఎవరో తెలుసా?