ఏపీలో కానిస్టేబుల్ రాత పరీక్ష... ఎగ్జామ్స్ సెంటర్ వద్ద ఇదీ పరిస్థితి...

Jan 22, 2023, 12:46 PM IST

మైలవరం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఇందులో భాగంగా 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా   3,95,415 మంది  పురుషులు, 1,08, 071 మంది  మహిళా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఇవాళ(ఆదివారం) ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే పరీక్ష ప్రారంభమవగా 9గంటల నుండి అభ్యర్థులను పరీక్ష హాల్ లోకి అనుమతించారు. నిర్ధేశించిన  సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్ధులను అనుమతించడం లేదు.  

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోనూ పలు కళాశాలలో  కానిస్టేబుల్ రాత పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మైలవరంలోని ప్రభుత్వ  డిగ్రీ కళాశాల,  లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కళాశాల,  కొండపల్లి నాగార్జున కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా చూస్తున్న  అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.