గాంధీ మెడికల్ కాలేజీలో వెలుగులోకి వచ్చిన ర్యాంగింగ్ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కొందరు జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు మద్యం పోయడం, సిగరెట్లు తాగించడం వంటి చేష్టలకు పాల్పడుతూ పైశాచికానందం పొందారు.
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిని బాధిత విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకురావడంతో ఈ విషయం బయటకు తెలిసింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. అందులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చింది.
ఐదేళ్లుగా ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన యువతి.. నిప్పంటించుకున్న యువకుడు..
‘సాక్షి’ కథనం ప్రకారం.. ఈ ర్యాంగింగ్ ఘటనపై డీఎంఈ అధికార వర్గాలు విచారణ చేపట్టాయి. ఇందులో పలువురు విద్యార్థులను సీనియర్లు బట్టలు విప్పించి డ్యాన్స్ లు చేయించారని వెల్లడైనట్టు తెలుస్తోంది. అలాగే జూనియర్లను బూతులు తిట్టారని, వారితో కూడా బూతులు మాట్లాడాలని బలవంతం చేశారని తెలిసింది. అయితే పలువురు విద్యార్థినులపై కూడా ర్యాంగింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిలో ఎంత వాస్తవముందే అనే విషయంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా.. అంతకు ముందు అధికారులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు.. తమను సీనియర్లు రాత్రి 2 గంటల సమయంలో హాస్టల్ రూములకు పిలిపించారని తెలిపారు. తమకు బలవంతంగా మద్యం పోశారని, సిగరెట్లు తాగించి, మానసిక వేదనకు గురి చేశారని పేర్కొన్నారు.
కాలేజీ నుంచి తిరిగివస్తున్న విద్యార్థినికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. సామూహిక అత్యాచారం..
ఇదిలా ఉండగా.. ఈ ర్యాగింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇలాంటివి మరెక్కడా జరగకుండా చూసేందుకు, దానిపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ హెల్త్ మినిస్ట్రీ భావిస్తోంది. అందుకే ఈ ర్యాంగింగ్ నిరోధించేందుకు అన్ని మెడికల్ కాలేజీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అన్ని ప్రైవేట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న ర్యాంగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని ఆదేశించింది. ఒక వేళ ఇలాంటి కమిటీలే లేకపోతే.. వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. స్టూడెంట్లకు ఈ విషయంలో కౌన్సెలింగ్ ఇవ్వాలని, హాస్టల్స్ ప్రాంతంలో రాత్రి సమయంలో నిఘా పటిష్టం చేయాలని ఆదేశించింది. బాధిత విద్యార్థుల నుంచి ఫిర్యాదు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్, అలాగే ఓ ఈ-మెయిల్ ఐడీ తయారు చేయాలని అధికారులు భావిస్తున్నారు.