
హైదరాబాద్: ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్ నుండి కొందరు ముఖ్య నేతలు తమ పార్టీలో చేరుతారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి శుక్రవారం నాడే ఇద్దరు నేతలు చేరాల్సి ఉందన్నారు. కానీ కొన్ని కారణాలతో ఈ చేరిక వాయిదా పడిందని చెప్పారు.
శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ పాలనపై అనేక మంది టీఆర్ఎస్ నేతలు విసిగిపోయారని చెప్పారు. కేసీఆర్ తీరుతో విసిగిన టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడబోతున్నారని ఉత్తమ్ చెప్పారు. ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలు అని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ చెప్పిన మాటలకు ఈ ఎన్నికలు రెఫరెండంగా ఆయన అభిప్రాయపడ్డారు.కేసీఆర్ పాలనకు బొందపెట్టే సమయం వచ్చిందన్నారు. జనం దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ చెప్పారు.రిటైర్మెంట్ ప్రకటించిన కేసీఆర్ కు ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.జాతీయస్థాయి సర్వేలు కూడ తెలంగాణలో తమ కూటమి అధికారంలోకి వస్తోందని ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
తమ కూటమికి పీపుల్స్ ఫ్రంట్‌గా పేరు పెట్టినట్టు చెప్పారు.పీపుల్స్ ప్రంట్ డిసెంబర్ 12వ తేదీన అధికారంలోకి వస్తోందని ఉత్తమ్ ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నందున పౌరసన్మానం చేస్తున్నట్టు ఉత్తమ్ చెప్పారు. తెలంగాణ బిల్లులో రైల్వే కోచ్ ను వరంగల్ లో ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే బీజేపీ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.
సంబంధిత వార్తలు
ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు
టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు
రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్
సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం
టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు
రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు
చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్
లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై