వంటేరు ఎన్నికల ప్రచారం.. వెక్కెక్కి ఏడ్చిన మహిళలు

Published : Nov 23, 2018, 11:46 AM IST
వంటేరు ఎన్నికల ప్రచారం.. వెక్కెక్కి ఏడ్చిన మహిళలు

సారాంశం

కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో.. కొందరు మహిళలు వెక్కెక్కి ఏడ్చారు. ఆయన భావోద్వేగ ప్రసంగం విని.. కొందరు మహిళలు తట్టుకోలేకపోయారు. దీంతో కన్నీరుపెట్టుకున్నారు.

కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో.. కొందరు మహిళలు వెక్కెక్కి ఏడ్చారు. ఆయన భావోద్వేగ ప్రసంగం విని.. కొందరు మహిళలు తట్టుకోలేకపోయారు. దీంతో కన్నీరుపెట్టుకున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే...టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు ప్రత్యర్థిగా కంగ్రెస్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వంటేరుకి సొంతూరులో ఓ సంఘటన ఎదురైంది.

గురువారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని తన స్వగ్రామమైన బూర్గుపల్లికి వంటేరు వెళ్లారు. ‘‘ పదిహేనేళ్లుగా నేను మీ మధ్యనే ఉంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నాను. గజ్వేల్ లో ఇల్లు కట్టుకుందామనుకున్నాను. కానీ ప్రతిపక్ష నేతననే కారణంతో నాకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ఊర్లో ఉంటున్న మా ఇల్లు కూలిపోయింది. పట్టణంలో అద్దెకు ఉంటున్నాను. ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక ఎప్పటికీ కనిపించను’’ అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఆయన మాటలు విన్న కొందరు మహిళలు వెక్కి వెక్కి ఏడ్చారు. వెంటనే ఆయన ఆ మహిళలను ఓదార్చారు. 

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family