డ్రగ్స్ కేసులో కేటీఆర్ ఆత్మీయులు.. సడెన్‌గా గోవా ట్రిప్పేంటీ: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 27, 2021, 5:27 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేటీఆర్ దగ్గరివారికి ప్రమేయం వుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని ఈడీ అఫిడవిట్‌లో తెలిపిందని..  కేటీఆర్ దగ్గరి వారికి  నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. అందుకే ఎక్సైజ్ శాఖను పట్టించుకోవడం లేదని.. అలాగే డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్ కొందరినీ వదిలివేశారని రేవంత్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు  టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ రాజీనామా చేసి వచ్చినా.. గజ్వేల్‌లో పోటీ చేస్తానని పేర్కొన్నారు. చేతనైతే ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికల్లోకి రావాలని రేవంత్ డిమాండ్ చేశారు. మేమేంటో మా బలం ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు చెప్పులు మోసి కేసీఆర్ బతికారంటూ రేవంత్ దుయ్యబట్టారు. కేటీఆర్ గోవాకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఆ వివరాలు బయట పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ALso Read:ఇది మల్లారెడ్డి అవినీతి చిట్టా... సర్వే నెంబర్లతో సహా బయటపెట్టిన రేవంత్ రెడ్డి

గత నాలుగు రోజులుగా కేటీఆర్ ఆందోళనలో వున్నారని.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేటీఆర్ దగ్గరివారికి ప్రమేయం వుందని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని ఈడీ అఫిడవిట్‌లో తెలిపిందని..  కేటీఆర్ దగ్గరి వారికి  నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. అందుకే ఎక్సైజ్ శాఖను పట్టించుకోవడం లేదని.. అలాగే డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్ కొందరినీ వదిలివేశారని రేవంత్ ఆరోపించారు. డ్రగ్స్‌తో పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని.. సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని తాను డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఎవరిని తప్పించేందుకు డ్రగ్స్ కేసును మూసేశారని రేవంత్ ప్రశ్నించారు. 

click me!