Viral  Video : ప్రతి గుండెను హత్తుకునే వీడియో... ఆకాశవీధిలో అమ్మ బర్త్ డే చేసిన బుడ్డోడు 

Published : Apr 24, 2024, 08:29 PM ISTUpdated : Apr 24, 2024, 08:38 PM IST
Viral  Video : ప్రతి గుండెను హత్తుకునే వీడియో... ఆకాశవీధిలో అమ్మ బర్త్ డే చేసిన బుడ్డోడు 

సారాంశం

ఆ కొడుకు తల్లికి జీవితాంతం గుర్తిండిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆకాశవీధిలో తల్లి పుట్టినరోజు వేడుక జరిపాడు బుడ్డోడు. అతడి తల్లిప్రేమకు ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు.

హైదరాబాద్ : ఏ తల్లి అయినా తన కడుపున పుట్టినవారికి ప్రేమ పంచాలని... వారి నుండి అంతే ప్రేమను పొందాలని అనుకుంటుంది. కన్నబిడ్డల కోసం చాలామంది తల్లులు తమ కలలను పక్కనబెట్టి ఒంటింటికి పరిమితం అవుతుంటారు... మరికొందరు తల్లులైతే జీవితాన్నే త్యాగం చేస్తుంటారు. ఇందుకు ప్రతిఫలంగా వారు కోరుకునేది కొంచెం ప్రేమ మాత్రమే. కానీ ఈ బిజీ లైఫ్ లో తల్లిదండ్రులకు  ప్రేమను పంచే కొడుకులు తక్కువయ్యారు. 

అయితే తనను నవమాసాలు మోసి ప్రాణంపోసి, అల్లారుముద్దుగా పెంచుతున్న తల్లిపై అంతులేని ప్రేమను కురిపించాడో బాలుడు. అకాశవీధిలో పుట్టినరోజు వేడుకను జరిపి ఆ తల్లి కళ్ళలో ఆనందాన్ని చూసి మురిసిపోయాడు. ప్రతి గుండెను హత్తుకునేలా తల్లీ బిడ్డ ప్రేమానురాగాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హైదరాబాద్ కు చెందిన అప్జల్ ఖాన్ ఎయిరిండియాలో క్యాబిన్ క్రూ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. ఇతడు తాను విధులు నిర్వర్తించే విమానంలో ఏవయినా ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటే వాటిని వీడియో తీసి తన 'మిస్టర్ క్యాబిన్ క్రూ' ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెడుతుంటాడు. ఇలా తాజాగా ఓ కొడుకు తల్లిపై ప్రేమను చాటుకున్న వీడియోను అతడు పోస్ట్ చేయగా అది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకూ ఆ వీడియోలో ఏముంది? 

ఓ బాలుడు తల్లితో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ  వుంటాడు. ప్లైట్ కెప్టెన్ అనౌన్స్ మెంట్ ఇస్తుండగా మెల్లిగా అతడివద్దకు వెళతాడు బాలుడు. ఈ రోజు తన తల్లి పుట్టినరోజు అని పైలట్ కు చెప్పి ఆమెకు విషెస్ తెలపాలని కోరతాడు. తల్లిపై ఆ పిల్లాడి ప్రేమను అర్థం చేసుకున్న పైలట్ కాదనలేకపోయాడు. ఎయిర్ ఇండియా సిబ్బంది తరపున ఆమెకు భర్త్ డే విషెస్ చెబుతాడు పైలట్. అంతేకాదు ఓ భర్త్ డే విషెస్ ను కూడా ఆ తల్లికి అందజేస్తాడు పైలట్. 

తన కోరికను మన్నించి తల్లికి భర్త్ డే విషెస్ తెలిపిన విమాన సిబ్బందికి బాలుడు కృతజ్ఞతలు తెలిపాడు. తల్లి కోసం ఆ కొడుకు చేసిన పని విమానంలోని మిగతా ప్రయాణికులనే కాదు సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసినవారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ బాలుడిని అందరూ ప్రశంసిస్తున్నారు... అలాగే కొడుకు ఇచ్చిన సర్ ప్రైజ్ తో ఆ తల్లి ముఖం వెలిగిపోవడం అందరికీ నచ్చుతోంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. 

 

PREV
click me!

Recommended Stories

CV Anand Takes Charge as Telangana DGP: | Asianet News Telugu
C V Anand Takes Charge as Telangana DGP: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు | Asianet News Telugu