Asianet News TeluguAsianet News Telugu

ఇది మల్లారెడ్డి అవినీతి చిట్టా... సర్వే నెంబర్లతో సహా బయటపెట్టిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి .. మల్లారెడ్డి అవినీతిని బయటపెట్టారు.

tpcc chief revanth reddy comments on minister malla reddy
Author
Hyderabad, First Published Aug 27, 2021, 4:50 PM IST

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి .. మల్లారెడ్డి అవినీతిని బయటపెట్టారు. మంత్రి మల్లారెడ్డి.. 50 ఎకరాల లే ఔట్‌ చేసిన వ్యాపారాని బెదిరించినట్లుగా ఆధారాలు బయటకు వచ్చాయని.. దీనితో పాటు ఆడియో టేపులు కూడా వెలుగుచూశాయని రేవంత్ తెలిపారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నట్లుగా ఆడియోలు బయటకు వచ్చాయని ఆయన ఆరోపించారు.

Also Read:కుక్క కాటుకు చెప్పు దెబ్బ, రాజీనామా చేయి: రేవంత్‌పై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్

ఇంత జరుగుతున్నా మంత్రి మల్లారెడ్డిపై సీఎం.. విచారణకు ఆదేశించలేదని రేవంత్ మండిపడ్డారు. మల్లారెడ్డి బావమరిదికి 16 ఎకరాల భూమి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆ భూమి మల్లారెడ్డికి గిఫ్ట్ డీడ్ అయ్యిందని.. ఆ భూమిని చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ  తెచ్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. గుండ్ల పోచమ్మపల్లి ఊర్లో 22 ఎకరాల భూమి వుందని... 2000-01 పహానిలో విభజన తర్వాత 22 ఎకరాల భూమి ఉన్నట్లు వుందన్నారు. ఈ భూమి 22 ఎకరాల 26 గుంటలు ఎలా అయ్యిందని రేవంత్ ప్రశ్నించారు. ఒకే సర్వే నెంబర్‌లో భూమి ఎలా పెరిగిందని ఆయన నిలదీశారు. 

ఆరోపణలు బయటకొస్తే పదవి నుంచి తప్పిస్తానని కేసీఆర్ అన్నారని  రేవంత్ గుర్తుచేశారు. ఈటలను తొలగించినట్లు మల్లారెడ్డిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గజదొంగలను పక్కనపెట్టుకుని రేవంత్ నీతులు చెబుతున్నారని రేవంత్ మండిపడ్డారు. మల్లారెడ్డి  విద్యాసంస్థలు, ఫోర్జరీ  సర్టిఫికెట్‌లు పెట్టిన దొంగ మల్లారెడ్డి  అన్నారు. తిట్ల పోటీ పెట్టుకుందామంటే చెప్పు.. ఫామ్‌హౌస్‌కు రమ్మంటే వస్తానంటూ రేవంత్ సవాల్ విసిరారు.

రాజయ్య, ఈటలకు ఒకనీతి.. మల్లారెడ్డికి ఓ నీతా అంటూ మండిపడ్డారు. మల్లారెడ్డి  కట్టిన భవనాలు.. పాత తేదీల ముద్రలతో అనుమతులిచ్చారని రేవంత్ ఆరోపించారు. మున్సిపాలిటీలో ఎంత  పన్ను కడుతున్నారనేది చూడాలని.. సూరారం కాలేజీలు చెరువుల్లో కట్టారా లేదా అని ఆయన ప్రశ్నించారు. అధికారులు కోర్టెకెళ్తే మా దగ్గర రికార్డులు లేవన్నది నిజం కాదా అని రేవంత్ దుయ్యబట్టారు. మల్లారెడ్డి మీద విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా వున్నారా లేదా ఆయన ప్రశ్నించారు. ప్రతీది మాకు చెప్పాల్సిన అవసరం లేదని రేవంత్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios