ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

Published : Oct 04, 2018, 02:27 PM ISTUpdated : Oct 04, 2018, 02:37 PM IST
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

సారాంశం

చాలా కాలంగా ఓటుకు నోటు కేసులో ఏ విధమైన చలనం లేదు. అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపైనే కాకుండా ఓటుకు నోటు కేసులో ఇతర నిందితులు ఉదయసింహ, సెబాస్టియన్ ఇళ్లలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. 

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని విచారించడం చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా ఓటుకు నోటు కేసులో ఏ విధమైన చలనం లేదు. అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపైనే కాకుండా ఓటుకు నోటు కేసులో ఇతర నిందితులు ఉదయసింహ, సెబాస్టియన్ ఇళ్లలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఈ కేసులో తెలంగాణ ఎసిబి వెనక్కి వెళ్లి ఐటి శాఖ ముందుకు వచ్చింది. దీని వెనక కొంత కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది.  ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం తేలిందా అంటూ గతంలో తెలంగాణ ఏసీబీకి ఐటీ శాఖ రెండు సార్లు లేఖ రాసిందని అంటున్నారు. 

ఆ డబ్బుల విషయంలో స్పష్టత రాలేదని ఎసిపి తాజాగా తెలియజేసిందని, దాంతో  ఐటీ స్వయంగా రంగంలోకి దిగిందని అంటుున్నారు. స్టీఫెన్‌సన్‌ ఫిర్యాదు మేరకు 2015 మే 31న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్‌, ఉదయ్‌సింహలను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత కొద్ది రోజులకే ఐటీ శాఖ తెలంగాణ ఏసీబీకి లేఖ రాసింది. రేవంత్ రెడ్డి వద్ద పట్టుబడిన డబ్బుల వివరాలు తెలిశాయా అని ఐటి శాఖ ఎసిబికి లేఖ రాసిందని అంటున్నారు. దానికి ఎసిబి సమాధానమిస్తూ... దర్యాప్తు కొనసాగుతోందని, డబ్బుల విషయం ఇంకా తేలాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం. 

మరికొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే ప్రశ్నకు సమాధానం కోరుతూ ఐటీ శాఖ ఏసీబీకి రెండో లేఖ రాసిందని చెబుతున్నారు. దీనికి కూడా సమాధానమిస్తూ... డబ్బుల విషయం తేలలేదని ఏసీబీ చెప్పినట్లు సమాచారం. 

దీంతో ఐటీ స్వయంగా రంగంలోకి దిగి సోదాలు నిర్వహించి, ఆ తర్వాత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. 2015 జూన్‌ నుంచి ఇప్పటి వరకు రూ.50 లక్షలకు సంబంధించిన విషయంపై ప్రధానంగా దృష్టి సారించింది.

సంబంధిత వార్తలు

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ చుట్టూ ఉచ్చు: ఉప్పల్ లో తేలిన ఉదయసింహ ఫ్రెండ్ రణధీర్

ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్