‘‘కేసీఆర్ పెట్రోల్ పోస్తే.. హరీష్ రావు అగ్గిపుల్ల వెలిగించాడు’’

Published : Oct 04, 2018, 01:57 PM IST
‘‘కేసీఆర్ పెట్రోల్ పోస్తే.. హరీష్ రావు అగ్గిపుల్ల వెలిగించాడు’’

సారాంశం

‘రాజకీయాలకు కేసీఆర్ అనర్హుడు, ఓటమి భయం వల్లనే అలా మాట్లాడుతున్నావ్.. ఎన్నికల తరువాత మెంటల్ ఆసుపత్రిలో చేర్చడం ఖాయం’ అని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దొంగ పాస్‌పోర్టు కేసులో కేసీఆర్‌, మనుషుల అక్రమరవాణా కేసులో హరీష్‌రావు నిందితులని ఆరోపించారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఒంటిపై పెట్రోల్ పోసుకుంటే కేసీఆర్‌, హరీష్‌రావు అగ్గిపుల్ల గీసి.. 1200 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్నారని మండిపడ్డారు. నిజామాబాద్‌ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలను ఖండించారు. చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. ‘రాజకీయాలకు కేసీఆర్ అనర్హుడు, ఓటమి భయం వల్లనే అలా మాట్లాడుతున్నావ్.. ఎన్నికల తరువాత మెంటల్ ఆసుపత్రిలో చేర్చడం ఖాయం’ అని వ్యాఖ్యానించారు.

అమరవీరుల ఆశయాలను నెరవేర్చడం కోసమే కూటమిగా ఏర్పడుతున్నామని రేవూరి అన్నారు. కోదండరాం వల్లనే తెలంగాణ ఉద్యమం ఉధృతమై తెలంగాణ సిద్ధించిందని అన్నారు. అంతేతప్ప కేసీఆర్‌ వల్ల కాదని అన్నారు. కూటమిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్‌ 2004, 2009 ఎన్నికల్లో ఎన్ని కోట్లు తీసుకున్నావో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్