పట్టించిన వీడియో: టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై కేసు

Published : Oct 04, 2018, 01:31 PM ISTUpdated : Oct 04, 2018, 01:33 PM IST
పట్టించిన వీడియో:  టీఆర్ఎస్ అభ్యర్థి  ఏనుగు రవీందర్‌రెడ్డిపై కేసు

సారాంశం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా  బరిలో ఉన్న  తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై  గురువారం నాడు  కేసు నమోదైంది.

నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా  బరిలో ఉన్న  తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై  గురువారం నాడు  కేసు నమోదైంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా  డ్వాక్రా సంఘాల మహిళలతో ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్‌కు ఓటేస్తే  రూ. 5 లక్షలను ఇవ్వనున్నట్టు చెప్పినట్టుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

డ్వాక్రా సంఘాల మహిళ లీడర్లంతా తమ సంఘాల్లోని సభ్యులకు  టీఆర్ఎస్‌కు ఓటేయాలని ఏనుగు రవీందర్ రెడ్డి కోరినట్టు ఆ వీడియోలో ఉంది. అయితే  ఈ విషయమై  జిల్లా కలెక్టర్‌ కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

ఈ ఆదేశం ఆధారంగా ఏనుగు రవీందర్ రెడ్డిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత  తొలిసారిగా నమోదైన కేసు ఏనుగు రవీందర్ రెడ్డిపై కావడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్