హైద్రాబాద్‌ రాజేంద్రనగర్‌లో దారుణం: టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై యువకుడి అత్యాచారం

By narsimha lodeFirst Published Dec 30, 2021, 9:40 AM IST
Highlights

హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. చివరికి ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. చివరకు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్ Rajendra nagar లో దారుణం చోటు చేసుకొంది. టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై ఓ యువకుడి Rapeకి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.  అయితే   ఆలస్యంగా ఈ విషయాన్ని బాధితురాలు  తల్లికి చెప్పింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Hyderabad రాజేంద్రనగర్‌ పరిధలో టెన్త్ చదువుకొనే విద్యార్ధినిని హిమాయత్ సాగర్  పరిధిలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.   ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ విషయాన్ని బాధితురాలికి  ఆలస్యంగా చెప్పింది. బాధితురాలిని తీసుుకెళ్లి రాజేంద్రనగర్ పోలీసులకు  ఫిర్యాదు చేసింది తల్లి.  ఈ ఘటనపై poice కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

also read:దారుణం.. మతిస్థిమితం లేని దళిత బాలికపై ఏడునెలలుగా, ఏడుగురు అత్యాచారం..

Telangana రాష్ట్రంలోని శామీర్ పేటలో ఓ విద్యార్ధినిపై ప్రధానోపాధ్యాయుడే అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రైవేట్ స్కూల్ ో 9వ తరగతి చదివే విద్యార్ధినిపై  ప్రిన్సిపాల్ అత్యాచారానికి ఒడిగట్టాడు. మాస్క్ పెట్టుకోలేదని ఆ బాలికను పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.   ఇదే స్కూల్లో పనిచేసిన వేరే చోట పనిచేస్తున్న ప్రిస్నిపాల్ అనుకోకుండా విద్యార్ధినికి కలిసింది. అయితే విద్యార్ధిని యాక్టివ్ గా లేని విషయాన్ని గుర్తించిన ప్రిన్సిపాల్ విద్యార్ధినిని నిలదీసింది. దీంతో అసలు విషయాన్ని తెలిపింది. 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పాలకులు కఠిన చట్టాలు తీసుకొచ్చారు. అయినా కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ఫోక్సో చట్టాలను కూడా అమలు చేస్తున్నారు. అయినా నిందితులు మాత్రం ఈ తరహ ఘటనలు పాల్పడడానికి వెనుకంజ వేయడం లేదు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు లేని రోజంటూ లేదంటే అతిశయోక్తి ఉండదు. నిర్భయ, దిశ లాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే ఈ తరహ ఘటనల  సమయంలోనే  అధికారుల హడావుడి కన్పిస్తోంది. అయితే ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముందు జాగ్రత్తలు లేవనే విమర్శలు లేకపోలేదు. అత్యాచారాలకు పాల్పడిన నిందితులపై వెంటనే శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకొంటే కొంతలో కొంతనైనా ఈ తరహ నేరాలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

click me!