సినీ ఇండస్ట్రీపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Sep 28, 2020, 5:06 PM IST
Highlights

సినీ రంగంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణి అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్: సినీ రంగంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణి అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు తెలంగాణ తెలుగు మహిళా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత- ఏర్పాటు పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో సినీ నటి దివ్యవాణి పాల్గొన్నారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్ కు అలవాటు పడ్డారన్నారు. వివిధ అవసరాల కోసం దిగజారే  రకాలు సినీ రంగంలో ఉన్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్ కేసు విచారణ ఎంతవరకు ఎంత వచ్చిందో కూడ తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. డబ్బున్నవాళ్లదే రాజ్యం అన్నట్టుగానే సినీ రంగంలో కూడ డబ్బున్నవాళ్లదే రాజ్యమని ఆయన చెప్పారు.

రకుల్‌ప్రీత్ సింగ్ కు ఉన్నదేమిటి, ప్రణీతకు లేనిదేమిటని  ఆమె ప్రశ్నించారు. పెద్ద హీరోలతో నటించకపోవడానికి ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి వివిధ కారణాలున్నాయన్నారు. 

తన కూతురు చదువుతున్న మాసబ్ ట్యాంక్  ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో సైతం డ్రగ్స్ అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారని ఆమె ఆరోపించారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. కన్నడ, బాలీవుడ్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమపై  కూడ డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తెలుగు పరిశ్రమపై దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

click me!