జగన్‌పై దాడి: మీ డ్రామా కంపెనీలో 30 ఏళ్లున్నా.. బాబుపై తలసాని ఫైర్

By sivanagaprasad kodatiFirst Published Oct 26, 2018, 11:43 AM IST
Highlights

విశాఖ విమానాశ్రయంలో దాడికి గురై హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇవాళ పరామర్శించారు. 

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విశాఖ విమానాశ్రయంలో దాడికి గురై హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇవాళ పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి దానిని రాజకీయం చేస్తూనే ఉన్నారని.. దాడి సంఘటనను ఒక ఎపిసోడ్‌లా క్రియేట్ చేసి డ్రామాలు ఆడుతున్నారంటూ తలసాని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని డ్రామా కంపెనీగా పోల్చిన తలసాని.. మీ డ్రామా కంపెనీలో తాను 30 ఏళ్లు ఉన్నానని.. చాలా డ్రామాలు చూశానంటూ వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షనేతపై దాడి జరిగితే గవర్నర్.. డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగితే తప్పా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు వేరైనా తామంతా ప్రజాస్వామ్యంలో కలిసే పనిచేస్తున్నామన్నారు. మానవతా దృక్పథంతోనే కేసీఆర్, కేటీఆర్, కవిత .. జగన్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని తలసాని అన్నారు.

డ్రామాలు అక్కడ నడుస్తాయేమో కానీ.. ఇక్కడ అలాంటివి కుదరదని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ప్రతిపక్షనేతపై దాడి జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని.. ఆనాడు అలిపిరిలో మీపై దాడి జరిగితే నాడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయని గుర్తు చేశారు. మనుషుల ప్రాణాలు పోయినా మేం రాజకీయాలు చేస్తామంటే ప్రజలంతా గమనిస్తున్నారని తలసాని అన్నారు. 

జగన్ పై దాడి... రంగంలోకి కేంద్ర దర్యాప్తు బృందం

జగన్‌‌పై దాడి: హైకోర్టుకెక్కిన వైసీపీ

ఎపి పోలీసులపై నాకు నమ్మకం లేదు: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

జగన్‌పై దాడి: కోర్టుకు రాలేనన్న వైసీపీ అధినేత.. లాయర్‌తో మెమో
 

click me!