నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Sep 25, 2018, 12:42 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. టీఆర్ఎస్‌లో తాను హరీశన్న వర్గమని.. తనలాగే ఆయనకు మద్ధతు పలికేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గత కొంతకాలంగా హరీశ్‌రావుకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గిపోతుండటం.. కొంగరకలాన్ బహిరంగసభలో హరీశ్‌రావును పట్టించుకోకపోవడం టీఆర్ఎస్‌లో పెద్ద చర్చకు కారణమైంది. ఇది జరిగిన కొద్దిరోజులకు సిద్ధిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపూర్‌లో జరిగిన సభలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్లయు చర్చనీయాంశమయ్యాయి. 

తాను అందరి ఆదరణ, అభిమానం ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందన్నారు. ఇంతవరకు చాలని.. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా.. మీకు సేవ చేస్తానని హరీశ్ అన్నారు. దీంతో ఆయన త్వరలో రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా..? లేదంటే కేసీఆర్‌పై ఆగ్రహంతో ఉన్నారా అంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. 

అవి భావోద్వేగంతో చేసిన మాటలేనని హరీశ్ తర్వాత చెప్పినప్పటికి.. లోపల ఇంకేదో జరిగి వుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టికెట్ దొరకని అభ్యర్థులను పక్కకు లాగి హరీశ్ రావు తన గ్రూప్‌ను సిద్దం చేసుకుంటున్నారని..త్వరలోనే పార్టీలో చీలిక తెస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటికి కొండా సురేఖ వ్యాఖ్యలు తోడు కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. 

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

 

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

click me!