నాయిని మాటలను తిప్పి కొట్టిన విజయశాంతి

Published : Sep 25, 2018, 12:36 PM IST
నాయిని మాటలను తిప్పి కొట్టిన విజయశాంతి

సారాంశం

అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని ఆమె  విమర్శించారు. 

తెలంగాణ ఆపద్ధర్మ హోం మంత్రి నాయిని వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత విజయశాంతి తిప్పి కొట్టారు. ఆదివారం ఏపీలో మావోయిస్టులు దాడి చేసి.. ఇద్దరు నేతలను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై స్పందించిన నాయిని.. తెలంగాణలో మావోయిస్టుల బెడద లేదని వ్యాఖ్యానించారు.

కాగా..ఆ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని విమర్శించారు. చంపడం తప్పయితే అందులో ప్రభుత్వాలకు మినహాయింపు లేదని తెలుసుకోవాలని ఆమె సూచించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్