రైతులకు కెసిఆర్ మరో ఎర

First Published Apr 13, 2017, 12:11 PM IST
Highlights

ఇప్పటి పథకాలు ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాకపోవటానికి ప్రధాన కారణం ఆర్ధిక పరిస్ధితే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అరాకొరా అమల్లో ఉన్న పథకాలు పూర్తి కావాలంటేనే వేల కోట్ల రూపాయలు కావాలి. ఇక, రైతులకు ఉచిత యూరియా పంపిణీ లాంటి పథకాలకు డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు?

పాలకుల హామీలకు అంతు లేకుండా పోతోంది. ఆచరణ సాధ్యామా కాదా అన్న రీతిలో కాకుండా ప్రతీ వర్గాన్ని ఓట్లుగానే చూస్తుండటంతోనే ఇష్టమొచ్చిన హామీలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, రైతులకు యూరియాను ఉచితంగా ఇస్తానంటూ ఓ సంచలన ప్రకటన చేసారు. దీనివల్ల 55 లక్షల మంది రైతులకు 26 లక్షల టన్నుల యూరియా ఉచితంగా పంపిణీ చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. అంటే ప్రభుత్వంపై సుమారుగా రూ. 2600 కోట్లు అదనపు భారామన్నమాట. ఇదంతా ఎందుకంటే, రానున్న ఎన్నికల్లో లబ్ది కోసమని చెప్పక తప్పదు.

రాష్ట్రంలోని అతిపెద్ద రంగమైన వ్యవసయంపై ఆధారపడ్డ రైతాంగాన్ని ఆకట్టుకునేందుకే కెసిఆర్ ఈ ప్రకటన చేసారు. సరే, ఇది ఎంతవరకూ అమలులోకి వస్తుందనేది వేరే సంగతి. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టునేందుకే ఎన్నో హామీలిచ్చారు. అవన్నీ ఎంత వరకూ నెరవేరాయని అడిగితే బొందలో పెడతానంటూ రంకెలేస్తారు. రైతురుణాలను మాఫీ చేసానని కెసిఆర్ చెబుతున్నారు. రుణమాఫీ ఎంత వివాదాస్పదమైందో తెలీదా? రుణమాఫీ వల్ల రైతాంగానికి నష్టమే తప్ప లాభం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా? పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు రుణాల మాఫీ చేసానని చెప్పుకోవటం ఒకటి. ఏపిలో కూడా రుణమాఫీ జరుగుతున్న విషయం కెసిఆర్ కు తెలీదా?

అలాగే, విద్యార్ధులకు ఫీజు మాఫీ పథకం అమలు ఎంత వరకూ వచ్చింది? ఎస్సీలకు తలా మూడు ఎకరాల భూ పంపిణీ పథకం ఏమైంది? పేదలకు 2 లక్షల పక్కా గృహాల నిర్మాణం ఏమైంది? ఉద్యోగాల భర్తీ...ఇలా చెప్పుకుంటూ పోతే అమలు కానీ హామీల సంఖ్య చాలానే ఉంటాయి.

ఇక నుండి విద్యుత్ కోతలుండవట. మూడు, నాలుగేళ్లలో కోటి ఎకరాలకు గోదావరి నీరు అందిస్తానంటూ ప్రకటించారు. ప్రతీ పథకం ఎక్కడ కూడా సంపూర్ణంగా అమలు కాకపోవటానికి ప్రధాన కారణం ఆర్ధిక పరిస్ధితే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అరాకొరా అమల్లో ఉన్న పథకాలు పూర్తి కావాలంటేనే వేల కోట్ల రూపాయలు కావాలి. ఇక, రైతులకు ఉచిత యూరియా పంపిణీ లాంటి పథకాలకు డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు?

click me!