తెలంగాణలో పవన్ పార్టీ పోటీలోనే లేదు... కానీ గాజుగ్లాసు పోటీలో...

By Arun Kumar PFirst Published May 2, 2024, 10:29 AM IST
Highlights

తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడమే లేదు... కానీ ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ మాత్రం పోటీలో నిలిచింది. ఆ సింబల్ ఈవిఎంలపై కనిపించనుంది.. 

హైదరాబాద్ : జనసేన పార్టీ ఎన్నికల గుర్తుపై గందరగోళం కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ పార్టీ గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది ఎన్నికల సంఘం. తెలంగాణలో జనసేన పోటీలో లేదు కాబట్టి ప్రాబ్లం లేదు... కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈసి నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం వుంది. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమికి ఎలక్షన్ కమీషన్ నిర్ణయం  దెబ్బేయనుంది. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపిని ఓడించేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తున్నారు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్. మరో పదిరోజుల్లో అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇలాంటి సమయంలో ఎలక్షన్ కమీషన్ నిర్ణయం కూటమికి షాకిచ్చింది. 

 జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది ఈసి. దీంతో ఖంగుతున్న జనసేన పార్టీ నాయకత్వం ఈసి నిర్ణయంపై ఏపీ హైకోర్టను ఆశ్రయించింది. దీంతో ఎలక్షన్ కమీషన్ కాస్త వెనక్కితగ్గి జనసేన పార్టీ పోటీలో వున్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పరిధిలో గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు కేటాయించమని కోర్టుకు తెలిపింది. అంటే జనసేన పోటీచేసే 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించరన్నమాట. కానీ మిగతా చోట్ల ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించనున్నారు. 

గాజు గ్లాస్ ను ఎన్నికల సంఘం ప్రీజ్ చేయాలని టిడిపి కూడా కోరుతోంది. చదవడం రాని ఓటర్లు కేవలం సింబల్ ను చూసి మాత్రమే ఓటువేస్తారు. కాబట్టి గాజు గ్లాసు గుర్తు పవన్ కల్యాణ్ పార్టీదే అని భావించే అవకాశం వుంటుంది. ఇది కూటమి విజయావశాలను దెబ్బతీయవచ్చు. కాబట్టి కేవలం జనసేన పోటీచేసే స్థానాల్లోనే కాదు రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థికి కూడా ఈ గుర్తును కేటాయించవద్దని టిడిపి కోరుతోంది. ఈ మేరకు టిడిపి కూడా  హైకోర్టులో ఓ పిటిషన్ దాాఖలుచేసింది. 

 తెలంగాణలోనూ గాజు గ్లాసు పోటీ : 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంలేదు. కాబట్టి ఇక్కడ గాజు గ్లాస్ గుర్తుతో ఏ ప్రాబ్లం లేదు. అందువల్లే ఎలక్షన్ కమీషన్ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తోంది. ఇలా హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్ సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే గాజు గ్లాసు గుర్తుపై గందరగోళం నెలకొంది. బిజెపి, జనసేన పార్టీలు కలిసి తెలంగాణలో  పోటీచేసాయి. ఈ క్రమంలో జనసేన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం వివాదంగా మారింది. అయితే తెలంగాణలో జనసేన ప్రభావం పెద్దగా లేకపోవడంతో పెద్దగా నష్టమేమీ జరగలేదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇప్పుడు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతో జనసేనకే కాదు కూటమికి తీవ్ర నష్టం జరిగే అవకాశం వుంది. అందువల్లే జనసేన కోర్టుకు వెళ్లిమరీ పోరాడుతోంది. 


 

click me!