మాకు ఆయుధాలు ఇవ్వండి: కోనేరు కృష్ణ దాడిపై అనిత

By narsimha lodeFirst Published Jul 3, 2019, 3:57 PM IST
Highlights

తనపై అత్యంత దుర్మార్గంగా  దాడికి పాల్పడ్డారని ఎఫ్ఆర్ఓ అనిత చెప్పారు. తాను మహిళ అని కూడ చూడకుండా దాడి చేశారని ఆమె ఆరోపించారు.
 

కాగజ్‌నగర్: తనపై అత్యంత దుర్మార్గంగా  దాడికి పాల్పడ్డారని ఎఫ్ఆర్ఓ అనిత చెప్పారు. తాను మహిళ అని కూడ చూడకుండా దాడి చేశారని ఆమె ఆరోపించారు.

బుధవారం నాడు ఆమె ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఆమె వివరించారు. గతంలో రెండు దఫాలు తనపై ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ  బెదిరింపులకు పాల్పడ్డాడని  ఆమె గుర్తు చేసుకొన్నారు. తనకేం జరిగినా కూడ కోనేరు కుటుంబానిదే బాధ్యత అని ఆమె చెప్పారు.

తాము ఎవరిపైనా కూడ దాడికి పాల్పడలేదన్నారు.  తమ డ్యూటీ తాము చేసినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు. తాము మొక్కలు నాటేందుకు వెళ్లిన స్థలం ముమ్మాటికీ అటవీశాఖకు చెందిన  భూమేనని ఆమె చెప్పారు. 

తమపై కృష్ణతో పాటు ఆయన అనుచరులు దాడులకు పాల్పడుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉండి కూడ కనీసం ఆపలేదన్నారు. తమ విధులకు అడ్డుపడకుండా ఉండేందుకు వీలుగా  ఆయుధాలు ఇవ్వాలని  ఆమె కోరారు.

సంబంధిత వార్తలు

అనితపై దాడి: కోనేరు కృష్ణ మరిన్ని అరాచకాలు, వీడియో లీక్

ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు

సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం

బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప

వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత

నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత

ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)

 

click me!