తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవిని టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌కు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవిని టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌కు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. అయితే ఈ విషయమై టీజేఎస్ చీఫ్ కోదండరామ్ స్పందించలేదు. కానీ, ఈ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహరమని టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ఆధివారం నాడు హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ సభల ఏర్పాట్లు, మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్ధుబాటు విషయమై ప్రదానంగా చర్చించారు.
మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు బాధ్యతను మాజీ మంత్రి జానారెడ్డికి అప్పగించారు. అయితే ఇదే సమయంలో టీజేఎస్ గురించి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మహాకూటమికి మెజార్టీ స్థానాలు దక్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలనే ప్రతిపాదన కూడ ఈ సమావేశంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు తుది నిర్ణయాన్ని తీసుకోలేదు.
మరోవైపు టీజేఎస్‌కు ఎన్నికల గుర్తు ఇంకా ఎన్నికల సంఘం కేటాయించలేదు. ఈ తరుణంలో టీజేఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేయించే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించారు.టీజేఎస్ అభ్యర్థులైనా... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి విజయం సాధిస్తే సాంకేతికంగా వారంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవుతారు.
ఒకవేళ ఇందుకు టీజేఎస్ ఒప్పుకొంటే రాజకీయంగా కాంగ్రెస్‌కు ప్రయోజనమే. కానీ, టీజేఎస్‌కు మాత్రం లాభం ఉండదనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కోదండరామ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వజూపే విషయమై టీజేఎస్ చీఫ్ కోదండరామ్ స్పందించలేదు.
కానీ, ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహరమని టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయమై ఇంకా షైనల్ కావాల్సి ఉంది.
సంబధిత వార్తలు
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?