ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

Published : Oct 15, 2018, 07:25 AM IST
ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

సారాంశం

నాగరావు, సత్యప్రియ దంపతులు తమ పిల్లలతో కలిసి ఆదివారం ప్రణయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడకు వచ్చారు.అమృతతో మాట్లాడాలని చెప్పి ఆమెను పిలిపించుకున్నారు.

మిర్యాలగూడ: ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తామని సంగారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు అమృత వర్షిణిని నమ్మించే ప్రయత్నం చేశారు. 
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు ఆ పనికి ఒడిగట్టారు.  ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతోందని,  కావాలంటే మాట్లాడిస్తామని వారు అమృతకు చెప్పారు. 

వచ్చే జన్మలో కూడా ప్రణయ్‌నీతోనే జీవించాలని అనుకుంటున్నట్లు వారు చెప్పారు. అయితే, వారిపై అమృతకు అనుమానం వచ్చింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగరావు, సత్యప్రియ దంపతులు తమ పిల్లలతో కలిసి ఆదివారం ప్రణయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడకు వచ్చారు.

అమృతతో మాట్లాడాలని చెప్పి ఆమెను పిలిపించుకున్నారు. ప్రణయ్‌ ఆత్మ మాతో మాట్లాడుతోందని, మీతో కూడా మాట్లాడిస్తామని, నీ కోసం ఆయన ఆత్మ ఘోషిస్తూ మీ ఇంటిచుట్టే తిరుగుతోందని వారు అమృతకు చెప్పారు. మారుతీరావు, ప్రణయ్‌లు గత జన్మలో శత్రువులని, ఈ జన్మలో పగ తీర్చుకునేందుకు ప్రణయ్‌ని మారుతీరావు హత్య చేయించాడే తప్ప నిజమైన పగలేదని వారు నమ్మించే ప్రయత్నం చేశారు. 

ప్రణయ్‌ విగ్రహం పెట్టకూడదని, విగ్రహం పెడితే అతడి ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుందని వారు అమృతకు చెప్పారు. దంపతుల ప్రవర్తనపై అనుమానంతో అమృత డీఎస్పీ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసింది. వన్‌టౌన్‌ సీఐ నాగరాజు ప్రణయ్‌ ఇంటివద్దకు చేరుకొని ఆ దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్