కేటిఆర్ పై జనశక్తి నక్సలైట్ల రెక్కీ?

Published : Oct 15, 2018, 08:36 AM IST
కేటిఆర్ పై జనశక్తి నక్సలైట్ల రెక్కీ?

సారాంశం

మంత్రి కేటీఆర్‌ను నక్సలైట్లు లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. విచారణ పూర్తి వివరాలను రాష్ట్ర డీజీపీకి సమర్పించినట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల: మంత్రి కేటి రామారావుపై జనశక్తి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనశక్తి జిల్లా కార్యదర్శి జక్కుల బాబుతో పాటు మరో నక్సలవైట్ శ్రీకాంత్‌ పట్టుబడ్డారు. 


ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరి వద్ద నుంచి అమెరికాలో తయారైన సెమీ ఆటోమెటిక్‌ రివ్వాలర్‌ను, 15 బుల్లెట్‌లను, రూ.46 వే స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. బాబు, శ్రీకాంత్‌లను పోలీసులు విచారించగా మంత్రి కేటీఆర్‌పై రెక్కి నిర్వహించినట్లు తెలిసింది. 


తంగెళ్ళపల్లి మండలం చిన్నలింగాపూర్‌ గ్రామానికి చెందిన బాబు 2016లో జనశక్తి విప్లవ పార్టీ ద్వారా అజ్ఞాతంలోకి వెళ్లాడు. తనకు జనశక్తి అగ్ర నాయకత్వం ఓ ఆయుధాన్ని అప్పగించిందని, సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ పునర్మిర్మాణ బాధ్యతలను అప్పగించిందని విచారణలో అతను చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 

అందులో భాగంగానే మంత్రి కేటీఆర్‌ను నక్సలైట్లు లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. విచారణ పూర్తి వివరాలను రాష్ట్ర డీజీపీకి సమర్పించినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్