రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు

By narsimha lode  |  First Published Nov 15, 2018, 12:40 PM IST

రాజేంద్రనగర్‌ కాంగ్రెస్ టికెట్టు  దక్కనందుకు  తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నేత కార్తీక్ రెడ్డి  గురువారం నాడు సమావేశమయ్యారు.
 



హైదరాబాద్:  రాజేంద్రనగర్‌ కాంగ్రెస్ టికెట్టు  దక్కనందుకు  తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నేత కార్తీక్ రెడ్డి  గురువారం నాడు సమావేశమయ్యారు.రాజేంద్రనగర్ ‌అసెంబ్లీ సీటును కార్తీక్ రెడ్డి ఆశించారు. అయితే  ప్రజా కూటమి(మహాకూటమి)లో పొత్తులో భాగంగా  టీడీపీకి టికెట్టు దక్కింది.  టీడీపీ టికెట్టు  గణేష్ గుప్తాకు కేటాయించింది.

అయితే  కూటమిలోని పార్టీల మధ్య  పొత్తుల్లొ భాగంగా కాంగ్రెస్‌కు బదులుగా ఈ సీటు టీడీపీకి దక్కింది. దీంతో  టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా ఈ స్థానం నుండి పోటీ చేయనున్నారు.

Latest Videos

అయితే ఈ సీటును ఆశించిన కార్తీక్ రెడ్డికి టికెట్టు దక్కలేదు. దీంతో గురువారం నాడు  రాజేంద్రనగర్‌లో కార్తీక్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజేంద్రనగర్ నుండి రెబెల్ గా కార్తీక్ రెడ్డి బరిలోకి దిగుతారా అనే చర్చ సాగుతోంది. రెబెల్‌గా కార్తీక్ రెడ్డి పోటీ చేస్తే  కూటమికి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు.

ఇదిలా ఉంటే  కార్తీక్ రెడ్డి  తల్లి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుండి పోటీ చేయనుంది. ఈ తరుణంలో కార్తీక్ రెడ్డి రెబెల్ గా బరిలో ఉంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత ఎన్నికల్లో  చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి  కార్తీక్ రెడ్డి బిరిలోకి  దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి చేతిలో  కార్తీక్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 

 

సంబంధిత వార్తలు

పొన్నాలకు మొండిచేయి...కాంగ్రెస్‌కు 28 వేల మంది కార్యకర్తల రాజీనామా

చివరి జాబితాలోనైనా పేరుంటుందా.. ఢిల్లీ వైపు కాంగ్రెస్ ఆశావహుల చూపు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

 

click me!