ఎన్నికల విచిత్రం..ప్రత్యర్థులు మారలేదు, పార్టీలే మారాయి

By ramya neerukondaFirst Published Nov 15, 2018, 12:17 PM IST
Highlights

ఎన్నికల సమయంలో రకరకాల విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. 

ఎన్నికల సమయంలో రకరకాల విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీచేసిన అభ్యర్థులు.. మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఒక పార్టీలో చేరి మిత్రులుగా మారుతుంటారు. శత్రువులు.. మిత్రులౌతారు. మిత్రులు.. శత్రువులుగా మారతారు. ఇవన్నీ రాజకీయాల్లో చాలా కామన్ గా జరిగే వ్యవహారాలు.

కాగా.. తెలంగాణ ఎన్నికల సమాయన ఇక్కడ మరో విచిత్రం చోటుచేసుకుంది. చెవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యర్థులు మారకున్నా.. వారి పార్టీలు మాత్రం మారిపోయాయి. మ్యాటరేంటంటే.. గత 2014 ఎన్నికల్లో  చేవెళ్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి యాదయ్య  పోటీ చేయగా... టీఆర్ఎస్ నుంచి రత్నం పోటీ చేశాడు. అప్పుడు యాదయ్య.. 781 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఆ తర్వాత రాజకీయ సమీకరణాల దృష్ట్యా... యాదయ్య.. టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రత్యర్థి వచ్చి పక్కన కూర్చోవడం నచ్చని రత్నం.. కాంగ్రెస్ లోకి జంప్ చేశాడు. అయితే.. ఈ 2018 ఎన్నికల సమయానికి వచ్చే సరికి మళ్లీ వీళ్లద్దరినీ ప్రత్యర్థులను చేశాయి ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు టీఆర్ఎస్ తరపున, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం విశేషం. 

click me!