ఈ రోజు ఎవరూ మర్చిపోరు... కశ్మీర్ విభజనపై బీజేపీ నేత రాజాసింగ్ కామెంట్స్

Published : Aug 05, 2019, 02:16 PM ISTUpdated : Aug 05, 2019, 02:23 PM IST
ఈ రోజు ఎవరూ మర్చిపోరు... కశ్మీర్ విభజనపై బీజేపీ నేత  రాజాసింగ్ కామెంట్స్

సారాంశం

  జమ్మూ కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి ని తొలగిస్తూ..  ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై పలువురు మద్దతు ప్రకటిస్తుంగా... పలువురు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై రాజా సింగ్ స్పందించారు.  

భారతదేశంలో.. ఈరోజుని ఎవరూ మర్చిపోలేరని బీజేపీ నేత రాజాసింగ్ అన్నారు.  జమ్మూ కశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  జమ్మూ కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి ని తొలగిస్తూ..  ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై పలువురు మద్దతు ప్రకటిస్తుంగా... పలువురు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై రాజా సింగ్ స్పందించారు.

మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కి ఆర్టికల్ 370ని రద్దు చేశారని రాజాసింగ్ చెప్పారు. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని మేనిఫెస్టోలో ఉంచినట్లు ఆయన చెప్పారు. గత ఎన్నికల సమయంలోనే తాము అధికారంలోకి వస్తే... ఆర్టికల్ 370ని తొలగిస్తామని మోదీ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీని నేడు అమలు చేశారని ఆయన అన్నారు.

ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో ఎవరైనా భూములు కొనుగోలు చేసుకోవచ్చని... ఎలాంటి ఫ్యాక్టరీ అయినా పెట్టుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో మన జాతీయ జెండా ఎగురుతుందని చెప్పారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

మోదీ తీసుకున్న ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్ లోని యువకులకు  ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ 370 ఆర్టికల్ ఎత్తివేసిన తర్వాత అక్కడ మంచి ఫ్యాక్టరీలు వస్తాయని.. దాంతో యువకులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

వీడియో

"

related news

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్