నిజామాబాద్ ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించిన రైతులు

By narsimha lodeFirst Published Apr 4, 2019, 11:54 AM IST
Highlights

తమకు గుర్తులు కేటాయించేలా ఈసీని ఆదేశించాలంటూ నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్న రైతుల అభ్యర్ధులు గురువారం నాడు హైకోర్టును  ఆశ్రయించారు.
 


హైదరాబాద్:  తమకు గుర్తులు కేటాయించేలా ఈసీని ఆదేశించాలంటూ నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్న రైతుల అభ్యర్ధులు గురువారం నాడు హైకోర్టును  ఆశ్రయించారు.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 185 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 177 మంది రైతులే. పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల సాధన కోసం నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీకి దిగారు.

అయితే పోటీలో ఉన్న కొందరు రైతు అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించలేదు. రెండు రోజుల క్రితం ఈ విషయమై రైతు అభ్యర్థులు నిజామాబాద్‌లో ఆందోళన కూడ నిర్వహించారు.అయినా కూడ ఫలితం లేకపోయింది.

ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. అయితే పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులకు ఇంకా గుర్తులు కేటాయించకపోవడం ప్రస్తుతం  సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తమకు గుర్తులు కేటాయించేలా ఈసీని ఆదేశించాలని హైకోర్టును రైతులు  ఆశ్రయించారు. అంతేకాదు ఎన్నికలను కనీసం 15 రోజుల పాటు వాయిదా వేయాలని కూడ కోరారు. 
 

సంబంధిత వార్తలు

నిజామాబాద్‌ పోలింగ్‌కు బెంగుళూరు నుండి మూడు ట్రక్కుల్లో ఈవీఎంలు

నిజామాబాద్ సీట్లో ఈవీఎంలే వాడుతాం: ఈసీ

ఇందూరు ఫైట్: బ్యాలెట్‌ పేపర్‌కే రైతుల పట్టు

నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)

click me!