కేసీఆర్ షాక్: విజయశాంతి పరిస్థితే హరీష్ రావుది కూడా....

By telugu teamFirst Published Apr 4, 2019, 10:55 AM IST
Highlights

నర్సాపూర్ బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడలేదు. గతంలో వేదికపై కేసీఆర్ పక్కనే విజయశాంతి కూర్చున్నప్పటికీ ఆమెతో మాట్లాడించలేదు. ఆ విషయాన్నే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 

మెదక్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ఏ నాయకుడైనా తనకు నచ్చకపోతే ఏమీ అనరు. పొమ్మనలేక పొగ పెడుతారు. ప్రస్తుతం సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఎదుర్కుంటున్న పరిస్థితి అదేనని అనిపిస్తోంది. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి టీఆర్ఎస్ లో ఎదుర్కున్న పరిస్థితినే ప్రస్తుతం హరీష్ రావు ఎదుర్కుంటున్నారనే చర్చ సాగుతోంది.

నర్సాపూర్ లో కెసిఆర్ ఎన్నికల ప్రచార సభ తర్వాత ఈ చర్చ మరింత ముమ్మరమైంది. నర్సాపూర్ బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడలేదు. గతంలో వేదికపై కేసీఆర్ పక్కనే విజయశాంతి కూర్చున్నప్పటికీ ఆమెతో మాట్లాడించలేదు. ఆ విషయాన్నే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 

కేసీఆర్ వేదికపైకి రాకముందు కార్యకర్తలు, నాయకులు, పోలీసులకు హరీశ్‌ రావు పలు సూచనలు చేశారు. ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పదేపదే మైకులో ప్రకటనలు చేశారు. సభను సమన్వయం చేశారు. వేదికపై తానే అంతా అయి వ్యవహరించారు. కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రం తన స్థానానికే పరిమితమయ్యారు. కేసీఆర్‌ కూడా తన ప్రసంగంలో ఎక్కడా హరీశ్‌ రావు పేరును ప్రస్తావించలేదు. ఇంతకు ముందు ఏ సభలోనూ హరీష్ రావు పక్కన ఉండగా ఆయన పేరును ప్రస్తావించకుండా కేసీఆర్ తన ప్రసంగాన్ని సాగించేవారు కాదు.

మెదక్ లోకసభ స్థానానికి పోటీ చేస్తు్న కొత్త ప్రభాకర్‌రెడ్డి మెజారిటీ ఐదు లక్షలు దాటుతుందని కేసీఆర్ అన్నారు,. మొత్తం రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అందరూ చెబుతున్నారని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితోపాటు సోదరి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు గానీ హరీష్ రావు పేరును ప్రస్తావించేలదు.

click me!