
నిజామాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేయాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు నిర్ణయం తీసుకొన్నారు. నిజామాబాద్ నుండి పసుపు రైతులు వారణాసికి బయలు దేరి వెళ్లనున్నారు.
ఈ నెల 11వ తేదీన నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 178 పసుపు రైతులు పోటీ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు.
తమ సమస్యలను పరిష్కరించాలని నిజామాబాద్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
నిజామాబాద్‌కు చెందిన రైతులు ఛలో వారణాసికి మంగళవారం నాడు శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ వారణాసి నుండి పోటీ చేశారు. ఈ దఫా కూడ ఆయన మరోసారి అదే స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఈ ఏడాది మే 19వ తేదీన వారణాసి ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
సంబంధిత వార్తలు
రైతులకు షాక్: నిజామాబాద్ ఎన్నికపై తేల్చేసిన హైకోర్టు
నిజామాబాద్ సీట్లో ఈవీఎంలే వాడుతాం: ఈసీ
ఇందూరు ఫైట్: బ్యాలెట్ పేపర్‌కే రైతుల పట్టు
నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే
నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు
కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు
కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు
ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్
ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు
కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ
నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)