ఆసియాకప్ టోర్నీలో బంగ్లాకిది మూడోసారి... భారత్‌తో రెండోసారి

By Arun Kumar PFirst Published Sep 28, 2018, 3:22 PM IST
Highlights

దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు అనూహ్యంగా ఫైనల్ కు చేరుకుంది. శ్రీలంక, పాకిస్థాన్ వంటి టాప్ జట్లను మట్టికరిపించి, అప్ఘాన్ వంటి పసికూన చేతిలో పరపరాభవాన్ని చవిచూసి...పడుతూ లేస్తూ ఎట్టకేలకు ఫైనల్ కు చేరుకుంది. అయితే ఫైనల్లో భారత్ వంటి బలమైన జట్టును ఎదుర్కొని నిలవడం బంగ్లాకు అంత తేలికైన విషయం కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు. 

ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్ ఫైనల్ కి చేరడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ రెండు సార్లు తుదిపోరుకు చేరుకున్నప్పటికి టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. మొదటిసారి 2012 లో పాకిస్థాన్ తో ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డ బంగ్లా ఓటమిపాలై రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016 లో (టీ20 పార్మాట్లో) జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసింది. 

ఇలా రెండుసార్లు ఫైనల్ కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కానీ ఈసారి ఎలాగైనా ఫైనల్లో గెలిచి టైటిల్ ను ముద్దాడాలని బంగ్లా భావిస్తోంది. కానీ మంచి ఫామ్ లో వున్న భారత జట్టు వారి ఆశలు నెరవేరనిస్తుందో...లేదో చూడాలి.  ఇవాళ జరిగే ఫైనల్ పోరులో బంగ్లా మరోసారి ఓడిపోయి మూడో ఓటమితో ఇంటిదారి పడుతుందో....లేక చరిత్ర తిరగరాస్తూ తొలిసారి టైటిల్ ను ముద్దాడుతుందో చూడాలి మరి. 
 
ఆసియా కప్ సంబంధిత వార్తలు

పాక్ ను చిత్తు చేసిన బంగ్లా: ఫైనల్లో భారత్ తో పోరు

మ్యాచ్ టై: భారత్ ను వణికించిన అఫ్గానిస్తాన్

రాహుల్.. ఇదంతా నీవల్లే.. నెటిజన్ల మండిపాటు

తగ్గని వెన్నునొప్పి.. ఆసియాకప్ నుంచి వైదొలిగిన హార్డిక్ పాండ్యా

పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు

click me!