T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది, జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే మే 22 నుండి స్వదేశంలో పాకిస్తాన్‌తో నాలుగు టీ20 మ్యాచ్ లను ఆడాల్సి ఉంది.
T20 World Cup 2024 - England : బీసీసీఐకి ఇంగ్లాండ్ బిగ్ షాకిచ్చింది. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐపీఎల్ 2024 మధ్యలోనే విడిచి వెళ్లడంతో ఫ్రాంఛైజీలు షాక్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఐపీఎల్ ప్లేఆఫ్‌లకు ముందు తమ ఆటగాళ్లను తిరిగి రావాలని పిలుపు అందించింది. రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఇంగ్లాండ్ బోర్డు తాజా జట్టును ప్రకటించింది. కెప్టెన్ గా జోస్ బట్లర్ ను ఎంపిక చేసిన ఈసీబీ మొత్తం 15 మంది ఆటగాళ్లను ప్రపంచ కప్ జట్టులో ఉంచింది. వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నారు.
ఐపీఎల్ 2024 లీగ్ దశ మే 19న ముగియనుంది. మే 21 నుంచి ప్లేఆఫ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే, ఇదే సమయంలో అంటే మే 22 నుంచి ఇంగ్లండ్ స్వదేశంలో పాకిస్థాన్‌తో నాలుగు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్‌కు వెళ్లే ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో పాల్గొనాలని ఈసీబీ అల్టీమేటం జారీ చేసింది. జట్టుకు పెంపికై ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి పాకిస్థాన్ తో జరిగే సిరీస్ లో పాల్గొనాలని సూచించింది.
IPL 2024 : ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ ఔట్.. అయ్యో హార్దిక్ భయ్యా ఎంత పనిచేశావ్.. !
జూన్ 1 నుండి వెస్టిండీస్, యుఎస్ఏ వేదికలుగా ప్రారంభమయ్యే మెగా ఈవెంట్ కోసం జట్టును ప్రకటించిన వెంటనే ఇంగ్లాండ్ ఆటగాళ్ళు అందరూ పాకిస్తాన్ సిరీస్‌కు తిరిగి రావాల్సి ఉంటుందని పేర్కొంది. "ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న ఎంపికైన ఆటగాళ్లు, 22 మే 2024 బుధవారం హెడ్డింగ్లీలో జరగనున్న పాకిస్థాన్‌తో సిరీస్ కోసం తిరిగి వస్తారు" అని ఈ
ఈసీబీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదికలో తెలిపింది.
కాగా, ప్రస్తుతం ఐపీఎల్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లు ఆడుతున్నారు. జట్టుకు ఎంపికైన వారిలో పలువురు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు కీలక ప్లేయర్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2024లో ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ఇంగ్లండ్ జట్టులో జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్‌లు ఫస్ట్-ఛాయిస్ ఓపెనర్లుగా ఉన్నందున రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరూ ప్రస్తుం మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయా జట్లకు మంచి ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. వీరు ప్లేఆఫ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కేకేఆర్, ఆర్ఆర్ రెండూ మొదటి నాలుగు స్థానాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. రాయల్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, కోల్ కతా నైట్ రైడర్స్ తొమ్మిది మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.
మొయిన్ అలీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) టీమ్ లో ఉన్నాడు. అయితే ఆల్ రౌండర్ ఈ సీజన్‌లో ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా లేవు. జానీ బెయిర్‌స్టో , సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్ అందరూ పంజాబ్ కింగ్స్‌లో భాగమే కానీ వారు ఇప్పటి వరకు కేవలం నాలుగు మ్యాచ్ లను మాత్రమే గెలిచారు. వారు మిగిలిన మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే తప్ప ప్లేఆఫ్‌కు చేరుకోలేరు.
ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ కు ఎంపికైనా ఐపీఎలోని ప్లేయర్లు
జోస్ బట్లర్ - రాజస్థాన్ రాయల్స్
మొయిన్ అలీ - చెన్నై సూపర్ కింగ్స్
జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్ - పంజాబ్ కింగ్స్
రీస్ టోప్లీ, విల్ జాక్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫిల్ సాల్ట్ - కోల్‌కతా నైట్ రైడర్స్
IPL 2024 : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. రోహిత్ కూడానా.. !